ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan నుంచి వెలువడుతున్న కలుషిత గాలి ఢిల్లీకి వస్తోంది

ABN, First Publish Date - 2021-12-03T17:32:33+05:30

పాకిస్థాన్‌ దేశం నుంచి వెలువడే కలుషిత గాలి ఢిల్లీలోని గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో శుక్రవారం వాదించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీంకోర్టులో యూపీ సర్కారు వాదన

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌ దేశం నుంచి వెలువడే కలుషిత గాలి ఢిల్లీలోని గాలి నాణ్యతను ప్రభావితం చేస్తుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో శుక్రవారం వాదించింది. దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యంలో యూపీలోని పరిశ్రమల పాత్ర ఏమీ లేదని ఉత్తరప్రదేశ్ సర్కారు తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ వాదిస్తూ... రాష్ట్రంలో పరిశ్రమలు తగ్గుముఖం పట్టాయని, యూపీ పరిశ్రమల కలుషిత గాలి ఢిల్లీ వైపు వెళ్లడం లేదని వాదించారు.



ఢిల్లీలో గాలి నాణ్యతపై ప్రభావం చూపడానికి పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న కలుషిత గాలి కారణమని రంజిత్ కుమార్ ఆరోపించారు.‘‘అంటే పాకిస్థాన్‌లో పరిశ్రమలను నిషేధించాలని మీరు కోరుతున్నారా?’’ అని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రశ్నించారు.  ఎనిమిది గంటల సమయం పరిమితితో ఉత్తరప్రదేశ్‌లోని చెరకు, పాల పరిశ్రమలు దెబ్బతింటాయని రంజిత్ కుమార్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

Updated Date - 2021-12-03T17:32:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising