ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు: కర్ణాటక మంత్రి కన్నీళ్లు

ABN, First Publish Date - 2021-03-09T21:41:09+05:30

తనపై వచ్చిన ఈ ఆరోపణల కారణంగా మార్చి 3న జలవనరుల శాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేశారు. వీడియో విడుదలైన రోజు తాను మంత్రి పదవికి రాజీనామా చేయబోనని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: శృంగార వీడియోలో ఉన్నది తాను కాదని, రాజకీయంగా తనను దెబ్బతీసేందుకు కుట్రతోనే ఇది తయారు చేశారని కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి అన్నారు. మంగళవారం ఉదయం తన ఇంట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆ వీడియో, సీడీ రెండూ పచ్చి అబద్ధం. నేను చాలా అమాయకుడిని. రాజకీయంగా నన్ను దెబ్బతీసేందుకు కుట్ర పన్ని ఇలా చేశారు’’ అని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు.


ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ఆ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఎవరో నాకు తెలియదు. అది నేను అన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోంది. నాపై జరుగుతున్న తప్పుడు ప్రచారం గురించి పార్టీ హైకమాండ్‌కు సమాచారం అందించాను. వారిని తగిన సహాయం చేయాల్సిందిగా కోరాను. నాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ కుట్రపై నేను పోరాటం కొనసాగిస్తాను’’ అని జర్కిహోళి అన్నారు. 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరీ తనను దెబ్బతీసేందుకు రాజకీయ కుట్ర పన్నారని ఆయన అన్నారు.


‘‘ఆ వీడియోను నేను 4 నెలల క్రితమే చూశాను. నా సోదరుడు బాలచంద్ర జర్కిహోళితో కూడా ఈ విషయంపై కొన్నిసార్లు చర్చించాను. నేను ఏ తప్పూ చేయలేదు. నాకందిన సమాచారం మేరకు.. ఆ వీడియోలో ఉన్న యువతి ఐదు కోట్ల రూపాయలు, విదేశాల్లో రెండు ప్లాట్లకు అమ్ముడుపోయింది. యశ్వంతపూర్‌లోని ఓరియన్‌ మాల్‌లో నాపై కుట్ర జరిగింది. ఇది నా ఇమేజ్‌ని, నా భవిష్యత్‌ని దెబ్బ కొట్టాలని జరిగిన కుట్ర’’ అని రమేష్ జర్కిహోళి అన్నారు.


కాగా, తనపై వచ్చిన ఈ ఆరోపణల కారణంగా మార్చి 3న జలవనరుల శాఖ మంత్రిగా ఆయన రాజీనామా చేశారు. వీడియో విడుదలైన రోజు తాను మంత్రి పదవికి రాజీనామా చేయబోనని రమేష్ ప్రకటించినప్పటికీ.. రాజకీయంగా దుమారం రేగడంతో మరుసటి రోజే రాజీనామా చేశారు.

Updated Date - 2021-03-09T21:41:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising