ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kashi Vishwanath దేవాలయానికి మోదీ రాక సందర్భంగా భారీ వేడుక

ABN, First Publish Date - 2021-12-13T13:23:33+05:30

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన నియోజకవర్గంలోని వరణాసి కాశీ విశ్వనాథ దేవాలయం, గంగా ఘాట్‌లను అనుసంధానించే కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశ పనులను నేడు ప్రారంభించనున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరణాసి (ఉత్తరప్రదేశ్):  ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన నియోజకవర్గంలోని వరణాసి కాశీ విశ్వనాథ దేవాలయానికి రాక సందర్భంగా భారీ వేడుక నిర్వహించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. గంగా ఘాట్‌లను అనుసంధానించే కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు మొదటి దశ పనులను నేడు ప్రారంభించనున్నారు. రూ.339 కోట్లతో నిర్మించిన శ్రీ కాశీ విశ్వనాథ్ ధామ్ మొదటి దశను మోదీ ప్రారంభిస్తారు.దాదాపు ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలోని  ప్రాజెక్టులో 23 భవనాలను ప్రారంభిస్తారు. మునుపటి ఆలయ ప్రాంగణం 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.ప్రధాని మోదీ ముందుగా పురాతన కాలభైరవ ఆలయాన్ని సందర్శిస్తారు. గర్భగుడి లోపల మోదీ కాశీ విశ్వనాథ్ ఆలయ ప్రధాన పూజారి శ్రీకాంత్ మిశ్రా సహాయంతో ప్రార్థనలు చేయనున్నారు.


 మోదీ లలితా ఘాట్ నుంచి కారిడార్‌లోకి ప్రవేశించి ప్రాంగణంలోని  ఉత్తర ద్వారం గుండా మందిర్ పరిసార్కు చేరుకుంటారు. లోపల ఉన్న శివలింగానికి గంగాజలాన్ని సమర్పిస్తారని ఆలయ అధికారులు చెప్పారు.దేశానికే కాకుండా ప్రపంచానికి కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని కొత్త ధామ్‌గా అందిస్తామని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార బీజేపీ ఎన్నికల ప్రచారంలో కీలక విజయాల్లో కాశీ కారిడార్ అభివృద్ధి అంశాన్ని ఒకటిగా ప్రదర్శించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ కాశీ రాక సందర్భంగా 55 హై-డెఫినిషన్ కెమెరాలు, నాలుగు జిమ్మీ జిబ్‌లు, భారీ డ్రోన్‌తో భారీ వేడుకను ప్లాన్ చేశారు.


Updated Date - 2021-12-13T13:23:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising