ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రూప్ కెప్టెన్ వరుణ్ మృతిపై మోదీ తీవ్ర ఆవేదన

ABN, First Publish Date - 2021-12-15T19:03:40+05:30

భారత వాయు సేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : భారత వాయు సేన (ఐఏఎఫ్) గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ బుధవారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, వరుణ్ సింగ్ ఆత్మగౌరవం, ధైర్యసాహసాలు, అత్యంత వృత్తి నైపుణ్యాలతో దేశానికి సేవ చేశారని నివాళులర్పించారు. ఆయన తుది శ్వాస విడిచినందుకు తాను తీవ్ర ఆవేదన చెందినట్లు తెలిపారు. ఆయన చేసిన సేవలను మన దేశం ఎన్నటికీ మర్చిపోదని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 


అంతకుముందు ఐఏఎఫ్ ఇచ్చిన ట్వీట్‌లో, గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అమరుడైనందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆయన 2021 డిసెంబరు 8న తమిళనాడులోని కూనూరు వద్ద జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారని, చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచారని  తెలిపింది. వరుణ్ కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని ప్రకటించింది. ఆయన మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపింది. 


డిసెంబరు 8న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ హెలికాప్టర్లో ప్రయాణించినవారిలో కేవలం వరుణ్ సింగ్ మాత్రమే తీవ్రంగా కాలిన గాయాలతో బెంగళూరులో చికిత్స పొందారు. 


Updated Date - 2021-12-15T19:03:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising