ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు పీఎం కిసాన్ నిధి విడుదల 14న

ABN, First Publish Date - 2021-05-13T19:42:16+05:30

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం క్రింద రైతులకు ఎనిమిదో విడత ఆర్థిక సహాయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 14న విడుదల చేస్తారు. ఈ కార్యక్రమం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శుక్రవారం ఉదయం 11 గంటలకు జరుగుతుంది. సుమారు 9.5 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.19 వేల కోట్లకు పైగా అందజేస్తారు. ఈ వివరాలను గురువారం ప్రధాన మంత్రి కార్యాలయం వెల్లడించింది. 


పీఎం కిసాన్ పథకం క్రింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున శుక్రవారం విడుదల చేస్తారు. ఈ సొమ్మును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ సందర్భంగా మోదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు రైతులతో మాట్లాడతారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు.  pmindiawebcast.nic.in లేదా దూరదర్శన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రజలు వీక్షించవచ్చు.


పీఎం కిసాన్ పథకం క్రింద చిన్నకారు, సన్నకారు రైతులు లబ్ధి పొందవచ్చు. లబ్ధిదారులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.6,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తారు. ఈ సొమ్మును రూ.2,000 చొప్పున మూడు విడతల్లో కేంద్ర ప్రభుత్వం అందజేస్తుంది. మొదటి విడత సహాయాన్ని ఏప్రిల్ 1 నుంచి జూలై 31 మధ్య కాలంలో, రెండో విడత సహాయాన్ని ఆగస్టు 1 నుంచి నవంబరు 30 మధ్య కాలంలో, మూడో విడత సహాయాన్ని డిసెంబరు 1 నుంచి మార్చి 31 మధ్య కాలంలో ఇస్తారు. 


Updated Date - 2021-05-13T19:42:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising