ఏడాది తర్వాత విదేశీ పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోదీ
ABN, First Publish Date - 2021-03-17T07:39:13+05:30
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చిలో భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ ఒక్క దేశ పర్యటనకు కూడా అధికారికంగా వెళ్లింది లేదు.
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా గతేడాది మార్చిలో భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రధాని మోదీ ఒక్క దేశ పర్యటనకు కూడా అధికారికంగా వెళ్లింది లేదు. ఏడాది తర్వాత ఇప్పుడు మళ్లీ ఆయన విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని విదేశాంగశాఖ వెల్లడించింది. మార్చి 26, 27 తేదీల్లో మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనున్నట్టు విదేశాంగశాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా మోదీ బంగ్లాదేశ్‌లో జరగబోయే అనేక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. షేక్ ముజిబుర్ రహమాన్ శత జయంతి, భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి కావడం, 26న బంగ్లాదేశ్ స్వాతంత్ర్య దినోత్సవం కావడం ఇలా అనేక ఈవెంట్లు ఉండటంతో మోదీ ఈ పర్యటనలో బిజీబిజీగా గడపనున్నారు.
Updated Date - 2021-03-17T07:39:13+05:30 IST