ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెలాఖరులో మోదీ అమెరికా పర్యటన!

ABN, First Publish Date - 2021-09-05T07:18:31+05:30

ప్రధాని మోదీ ఈ నెలాఖరులో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌లో పర్యటించే మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ సమావేశమవుతారని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: ప్రధాని మోదీ ఈ నెలాఖరులో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. వాషింగ్టన్‌ డీసీ, న్యూయార్క్‌లో పర్యటించే మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దేశంలో మోదీ పర్యటించడం ఇదే తొలిసారి. అయితే, ఈ పర్యటనను అధికారికంగా ధ్రువీకరించలేదు. పర్యటన షెడ్యూల్‌ కూడా ఖరారు కాలేదు. కానీ, మోదీ ఈ నెల 22-27 తేదీల్లో ఎప్పుడైనా అమెరికా వెళ్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 25వ తేదీన న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనే మోదీ వాషింగ్టన్‌లో క్వాడ్‌ నాయకుల సమ్మిట్‌లోనూ పాల్గొనే అవకాశముందని ప్రభుత్వ వర్గా లు తెలిపాయి. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 


కొవిడ్‌ తర్వాత రెండో విదేశీ పర్యటన

ప్రధానిగా 2014లో తొలిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత 60 దేశాల్లో 100కు పైగా పర్యటనలు జరిపిన మోదీ.. కొవిడ్‌ మహమ్మారి తర్వాత బంగ్లాదేశ్‌ (ఈ ఏడాది మార్చిలో) మినహా విదేశాలకు వెళ్లలేదు. 2019లో చివరిసారి అగ్రరాజ్యానికి వెళ్లిన మోదీ ‘హౌదీ మోదీ’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులతో భారీ సభ నిర్వహించారు. 


అగ్రస్థానంలో మోదీ

అమెరికాకు చెందిన ‘మార్నింగ్‌ కన్సల్ట్‌’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో భారత ప్రధాని మోదీ 70ు రేటింగ్‌తో ప్రపంచ నేతల్లో అగ్రస్థానంలో నిలిచారు. అగ్రరాజ్యాధి నేతలు జో బైడెన్‌, బోరిస్‌ జాన్సన్‌ కూడా మోదీ కంటే తక్కువ రేటింగ్‌లో ఉన్నారు. ఈ సంస్థ వయోజనుల అభిప్రాయం సేకరించింది.

Updated Date - 2021-09-05T07:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising