ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ ఓ మైలురాయి’

ABN, First Publish Date - 2021-08-13T18:33:31+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వెహికిల్ స్క్రాపింగ్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వెహికిల్ స్క్రాపింగ్ పాలసీని ప్రకటించారు. దేశాభివృద్ధి ప్రస్థానంలో ఇది చెప్పుకోదగ్గ మైలురాయి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత, స్టార్టప్స్ చేరాలని కోరారు. ఇది చెత్త నుంచి సంపదను సృష్టించే పధకమని తెలిపారు. ఈ పాలసీని వాలంటరీ వెహికిల్ ఫ్లీట్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ అని కూడా పిలుస్తున్నారు. గుజరాత్‌లో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో మోదీ శుక్రవారం వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. 


భారత దేశ అభివృద్ధి ప్రస్థానంలో వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ ఓ గొప్ప మైలురాయి అని చెప్పారు. వెహికిల్ స్క్రాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం గుజరాత్‌లో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సు విస్తృత అవకాశాలను తీసుకొస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చేరాలని యువత, స్టార్టప్‌లను కోరారు. ఉపయోగించడానికి యోగ్యత కోల్పోయిన వాహనాలను, కాలుష్య కారక వాహనాలను పర్యావరణ హితకరమైన పద్ధతుల్లో తొలగించడానికి ఈ కార్యక్రమం అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ పాలసీ వల్ల దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు, రిజిస్టర్డ్ వెహికిల్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటుకు వీలవుతుందన్నారు. ఈ పాలసీ వల్ల దాదాపు రూ.10 వేల కోట్ల మేరకు పెట్టుబడులు రావచ్చునని తెలిపారు. 


కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, దేశంలో ఎటువంటి వ్యాలిడ్ ఫిట్‌నెస్ లేని వాహనాలు దాదాపు 1 కోటి వరకు ఉన్నాయన్నారు. వాహనం వయసునుబట్టి కాకుండా, దాని ఫిట్‌నెస్ ఆధారంగా ఈ స్క్రాపింగ్ పాలసీ వర్తిస్తుందన్నారు. 


Updated Date - 2021-08-13T18:33:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising