ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాంధీజీ ఆదర్శాలు లక్షలాది మందికి స్ఫూర్తిదాయకం : మోదీ

ABN, First Publish Date - 2021-10-29T23:32:26+05:30

గాంధీజీ ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రోమ్ : గాంధీజీ ఆదర్శాలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ధైర్యం, ప్రేరణ ఇస్తాయని, ఆయనకు రోమ్‌లో నివాళులర్పించే అవకాశం తనకు లభించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతకుముందు ఆయన నగరంలోని పియాజా గాంధీ వద్ద గాంధీజీకి నివాళులర్పించారు. ఇటలీలోని భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుని, మోదీకి ఘన స్వాగతం పలికారు. ఆ ప్రాంతమంతా ‘‘మోదీ, మోదీ...’’ నినాదాలతో మారుమోగింది. 


మోదీని సమీపం నుంచి చూడటానికి, ఆయనతో కరచాలనం చేయడానికి  భారత సంతతి ప్రజలు చాలా ఉత్సాహంతో ప్రయత్నించారు. నాగపూర్‌లో జన్మించిన హరి ఓం కాలియా ఇటలీలో 20 సంవత్సరాల నుంచి యోగా బోధిస్తున్నారు. ఆయన తన ముగ్గురు శిష్యులతోపాటు శివ స్థుతిని పఠించారు. దీంతో మోదీ ముఖంలో చిరునవ్వు తొణికిసలాడింది. హరి ఓం కాలియా ప్రధాని మోదీతో మాట్లాడుతూ, తాను నాగపూర్‌లో జన్మించానని తెలిపారు. ఆయనతో మోదీ మరాఠీలో సంభాషించారు. మరో మహిళ గుజరాతీలో మోదీ క్షేమ సమాచారాన్ని అడిగినపుడు, ఆమెకు గుజరాతీలో సమాధానం చెప్పారు. 


అనంతరం మోదీ అక్కడికి వచ్చిన ఇతరులకు అభివాదం చేశారు. వారంతా ‘‘భారత్ మాతా కీ జై’’, ‘‘మోదీ... మోదీ...’’ అంటూ నినాదాలు చేశారు. 


Updated Date - 2021-10-29T23:32:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising