ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉత్తర ప్రదేశ్‌లో నవ శకం : మోదీ

ABN, First Publish Date - 2021-11-16T20:52:59+05:30

ఉత్తర ప్రదేశ్‌లో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో నిర్మించిన పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ఎక్స్‌ప్రెస్‌వే నిదర్శనమని తెలిపారు. ఇది అత్యాధునిక రహదారి అని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని చెప్పారు. సుల్తాన్‌పూర్ జిల్లాలోని కర్వాల్ ఖేరిలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. 


పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వే పొడవు 341 కిలోమీటర్లు. దీనిని మంగళవారం ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్, ఆ రాష్ట్ర ప్రజల సత్తాపై ఎవరికైనా సందేహాలుంటే, సుల్తాన్‌పూర్ వచ్చి నిజాలు తెలుసుకోవాలన్నారు. మూడు, నాలుగేళ్ళ క్రితం ఓ సాధారణ భూమి ఉన్న చోట ఇప్పుడు అత్యాధునిక ఎక్స్‌ప్రెస్‌వే వచ్చిందన్నారు. గత ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలోని తూర్పు ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయన్నారు. దేశ భద్రత గురించి పట్టించుకోనివారికి పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఉన్న ఎయిర్‌స్ట్రిప్ గట్టి సందేశం పంపుతుందని చెప్పారు. కాలనేమి అనే రాక్షసుడిని చంపిన హనుమంతుడికి నమస్కరిస్తూ మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 


ఇక్కడ 3.2 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఓ వైమానిక స్థావరాన్ని నిర్మించారు. అత్యవసర సమయాల్లో భారత వాయు సేన విమానాలు ఇక్కడ దిగుతాయి. 


Updated Date - 2021-11-16T20:52:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising