ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డ్రమ్స్ వాయిస్తూ మోదీ సందడి

ABN, First Publish Date - 2021-11-03T16:15:39+05:30

స్కాట్లాండ్‌లో భారత సంతతి ప్రజలు భారత దేశ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్లాస్గో : స్కాట్లాండ్‌లో భారత సంతతి ప్రజలు భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సాదరంగా వీడ్కోలు పలికారు. సంప్రదాయ దుస్తులైన కుర్తా, పైజమా, తలపాగా ధరించి, బాజాభజంత్రీలు వాయిస్తూ, నాట్యం చేస్తూ వీడ్కోలు పలికారు. మోదీ కూడా వారితో కలిసి ఓ డ్రమ్ వాయించి సందడి చేశారు. ఆయన ఐక్యరాజ్య సమితి సీఓపీ26 సదస్సుకు హాజరై, తిరిగి బుధవారం ఉదయం స్వదేశానికి వచ్చారు. 


స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో మోదీ బస చేసిన ఓ హోటల్ వద్దకు భారత సంతతి ప్రజలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆయన హోటల్ నుంచి బయటికి రాగానే వీరందరితోనూ ఆత్మీయంగా మాట్లాడారు. చాలా మంది బాలలతో కరచాలనం చేసి, మాట్లాడారు. ఓ చిన్నారితో సరదాగా సంభాషించారు. విమానాశ్రయం వద్ద కూడా భారత సంతతి ప్రజలు ఆయనకు వీడ్కోలు పలికారు. డ్రమ్స్ వాయించి సందడి చేశారు. కొందరు ఆయన ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు. 


ఈ పర్యటనలో మోదీ బ్రిటన్, ఇజ్రాయెల్, నేపాల్, ఇటలీ, ఫ్రాన్స్, తదితర దేశాల అగ్ర నేతలతో చర్చలు జరిపారు. సీఓపీ26 సదస్సులో ఐదు అమృత్ తత్వాలను ప్రకటించారు. 2070నాటికి శూన్య ఉద్గారాల లక్ష్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 


Updated Date - 2021-11-03T16:15:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising