ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీనియర్ కేబినెట్ మంత్రులతో మోదీ భేటీ

ABN, First Publish Date - 2021-11-29T17:13:39+05:30

పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం తన కేబినెట్‌లోని సీనియర్ మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ పాల్గొన్నారు. 


ఇదిలావుండగా, సాగు చట్టాలు, పెగాసస్ స్నూపింగ్ వివాదంపై రాజ్యసభలో అంతరాయం కలిగించిన ఆరుగురు టీఎంసీ ఎంపీలను సస్పెండ్ చేసేందుకు తీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టాలో రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు నిర్ణయిస్తారు. 


ప్రతిపక్ష సభ్యుల నినాదాల నేపథ్యంలో లోక్‌సభ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. అంతకుముందు ఇటీవల కొందరు సభ్యులు మరణించడంతో, వారి మృతి పట్ల సంతాపం తెలియజేసే తీర్మానాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చదివారు. 


ఇటీవల మరణించిన సభ్యులకు సంతాపం తెలిపిన తర్వాత రాజ్యసభ కూడా ఓ గంటసేపు వాయిదా పడింది. 


శీతాకాల సమావేశాల్లో వివాదాస్పద సాగు చట్టాల రద్దుతోపాటు 26 బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది. 


Updated Date - 2021-11-29T17:13:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising