ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉజ్వల యోజన 2.0 స్కీమ్ ప్రారంభించిన మోదీ

ABN, First Publish Date - 2021-08-10T20:19:13+05:30

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన-పీఎంయూవైలో భాగంగా ఉజ్వల 2.0 ఎల్పీజీ కనెక్షన్స్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన-పీఎంయూవైలో భాగంగా ఉజ్వల 2.0 ఎల్పీజీ కనెక్షన్స్ స్కీమ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారంనాడు ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లా నుంచి ఈ పథకాన్ని ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉజ్వల యోజన-2021ను గ్రామీణ ప్రాంతాల్లోని లక్షలాది కుటుంబాలకు ముఖ్యంగా బలహీన వర్గాలకు ఎల్‌పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చే ఉద్దేశంతో ప్రారంభించారు. ఉజ్వల స్కీమ్ తొలి విడతలో అవకాశం రాని వారిని పరిగణనలోకి తీసుకుని 2.0 స్కీమ్‌ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులతో ప్రధాని మాట్లాడారు. ఈ పథకం ద్వారా మరిన్ని కుటుంబాలకు ఎల్‌పీజీ కనెక్షన్లు ఇస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహోబా నుంచి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. మొదటి విడతగా యూపీలోని పేద కుటుంబాలకు 1,47,43,862 ఎల్‌పీజీ కనెక్షన్లు ఇచ్చారు. ఉజ్వల 2.0 స్కీమ్‌ను 2021-22 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది.


కాగా, మహోబా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన బయోఫ్యూయల్ ఎగ్జిబిషన్‌ను సీఎం ఆదిత్యనాథ్, పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి ప్రారంభించారు. ప్రపంచ బయోఫ్యూయల్ దినోత్సవంగా సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఇదే సందర్భంగా ముజఫర్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసిన కంప్రెస్సెడ్ బయోగ్యాస్ ప్లాంట్‌ను కూడా ప్రారంభించారు.

Updated Date - 2021-08-10T20:19:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising