ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సంసద్ టీవీని ప్రారంభించిన మోదీ

ABN, First Publish Date - 2021-09-16T00:31:28+05:30

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం సంసద్ టీవీ ప్రసారాలను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం సంసద్ టీవీ ప్రసారాలను ప్రారంభించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు, లోక్‌సభ సభాపతి ఓం బిర్లా సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను కలిపి సంసద్ టీవీగా ఏర్పాటు చేశారు. పార్లమెంటు కార్యకలాపాలను విస్తృత స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా సంసద్ టీవీని ప్రారంభించారు. 


మోదీ మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవంనాడు సంసద్ టీవీ ప్రారంభమవుతుండటం సంతోషకరమని చెప్పారు. 


సంసద్ టీవీలో కార్యక్రమాలు ముఖ్యంగా నాలుగు రకాలుగా ప్రసారమవుతాయి. పార్లమెంటు, ప్రజాస్వామిక వ్యవస్థల కార్యకలాపాలు; పథకాలు, విధానాల అమలు, పాలన; భారత దేశ చరిత్ర, సంస్కృతి; సమకాలిక స్వభావంగల సమస్యలు, ఆసక్తులపై కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 


లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీలను కలిపి ఒకే చానల్‌ను ఏర్పాటు చేయడానికి ప్రసార భారతి సీఈఓ సూర్య ప్రకాశ్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం తెలిపింది. లోక్‌సభ టీవీ 2006 జూలైలో ఏర్పాటైంది. లోక్‌సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆలోచనల మేరకు దీనిని ఏర్పాటు చేశారు. రాజ్యసభ టీవీ 2011లో ప్రారంభమైంది. ఈ చానల్‌లో రాజ్యసభ కార్యకలాపాలతోపాటు విజ్ఞానదాయక కార్యక్రమాలు కూడా ప్రసారమవుతుండేవి. 


Updated Date - 2021-09-16T00:31:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising