ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎర్ర కోట నుంచి నేను ఏం మాట్లాడాలో చెప్పండి : మోదీ

ABN, First Publish Date - 2021-07-30T18:46:27+05:30

స్వాతంత్ర్య దినోత్సవాలనాడు ప్రజల భావాలు ఎర్రకోట నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవాలనాడు ప్రజల భావాలు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనించబోతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలో ప్రజల ఆలోచనలకు స్థానం లభించబోతోంది. ప్రధాన మంత్రి కార్యాలయం శుక్రవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రజల భావాలు ఎర్రకోట నుంచి ప్రతిధ్వనిస్తాయని పేర్కొంది. ‘‘ఆగస్టు 15న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం కోసం మీ ఆలోచనలు ఏమిటి? @mygovindia ద్వారా మీ ఆలోచనలు పంచుకోండి’’ అని కోరింది.


MyGov.in పోర్టల్‌ ద్వారా కూడా ఈ పిలుపును ఇచ్చారు. స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రధాన మంత్రి మోదీ ప్రసంగంలో తన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల గురించి వివరిస్తారని తెలిపారు. నాలుగేళ్ళ నుంచి నేరుగా ప్రజల ఆలోచనలు, సలహాలను కోరుతున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా ప్రజలు నవ భారతం కోసం తమ సలహాలను అందజేయాలని కోరారు. సలహాలకు అక్షర రూపం ఇచ్చి, తెలియజేయాలని కోరారు. ప్రజలు పంపించిన అంశాల్లో కొన్నిటిని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తారని తెలిపారు. 


ఈ ట్వీట్ వచ్చిన కొద్ది క్షణాలకే జనం స్పందించడం ప్రారంభించారు. కొందరు పెగాసస్, రఫేల్, పెట్రో ధరల పెరుగుదల, సాగు చట్టాలు వంటివాటి గురించి మాట్లాడాలని కోరారు. మరికొందరు కోవిడ్-19 వ్యాక్సినేషన్ గురించి మాట్లాడాలని కోరారు. 


Updated Date - 2021-07-30T18:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising