ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా కూతుర్ని కొట్టొద్దు.. అమ్మేసిన తండ్రి విజ్ఞప్తి

ABN, First Publish Date - 2021-11-04T18:01:29+05:30

అప్ఘానిస్థాన్ దేశంలో ఓ వ్యక్తి తన కుటుంబానికి ఆహారం కోసం 9 ఏళ్ల పర్వానా మాలిక్ అనే బాలికను 55 ఏళ్ల వ్యక్తికి విక్రయించిన ఘటన తాజాగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్ : అప్ఘానిస్థాన్ దేశంలో ఓ వ్యక్తి తన కుటుంబానికి ఆహారం కోసం 9 ఏళ్ల పర్వానా మాలిక్ అనే బాలికను 55 ఏళ్ల వ్యక్తికి విక్రయించిన ఘటన తాజాగా వెలుగుచూసింది.ఆఫ్ఘనిస్తాన్‌లోని శరణార్థి శిబిరంలో ఉన్న పర్వానా మాలిక్ ను అతని తండ్రి అబ్దుల్ మాలిక్ విక్రయించాడు. తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నాక అబ్దుల్ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు కుమార్తెను విక్రయించాడు. తనను వృద్ధుడికి విక్రయించాక తనను కొడతాడేమోనని పర్వానా మాలిక్ భయపడుతోంది.


‘‘నా కూతురు మీ వధువు, ఆమెను జాగ్రత్తగా చూసుకోండి...దయచేసి ఆమెను కొట్టవద్దు’’ అని అబ్దుల్ మాలిక్ 55 ఏళ్ల వ్యక్తిని కోరాడు. ఆకలితో పలు కుటుంబాలు తమ పిల్లల్ని అమ్ముకోవాల్సి వస్తోంది. తన కూతుర్ని కొట్టవద్దని బాలిక తండ్రి అబ్దుల్ మాలిక్ కొనుగోలుదారైన వృద్ధుడిని వేడుకోవడం అందరినీ కలిచివేసింది. తన కుటుంబంలోని 8మంది కుటుంబసభ్యులను సజీవంగా ఉంచడానికి కుమార్తెను విక్రయించాల్సి వచ్చిందని బాలిక తండ్రి చెప్పారు. 


బాద్గిస్ ప్రావిన్సులోని శరణార్థి శిబిరంలో నివశిస్తున్నఅబ్దుల్ తనకు వీలైనప్పుడు డబ్బు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాడు. మరో హృదయ విదారక సందర్భంలో ఒక బామ్మ తన కుటుంబం మనుగడ కోసం తన ఇద్దరు మనుమరాళ్లను బలవంతంగా విక్రయించాల్సి వచ్చిందని వివరించింది.

Updated Date - 2021-11-04T18:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising