ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణికులు ఇలా చేస్తే బస్సు నుంచి దించేస్తారు..

ABN, First Publish Date - 2021-11-12T21:58:02+05:30

బస్సుల్లో ప్రయాణించే వారు మొబైల్ స్పీకర్లతో పాటలు వింటూ జర్నీ చేయడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం ఇక ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: బస్సుల్లో ప్రయాణించే వారు మొబైల్ స్పీకర్లతో పాటలు వింటూ జర్నీ చేయడం, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించడం ఇక కుదరదు. అలా చేస్తే బస్సులో నుంచి దించేస్తారు. ఈ మేరకు కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (కేఎస్ఆర్‌టీసీ) బస్సుల్లో వెళ్లే ప్రయాణికుల మొబైల్ స్పీకర్ల వాడకంపై ఆ రాష్ట్ర హైకోర్టు నిషేధం విధించింది.


బస్సులో ప్రయాణిస్తున్న కొందరు మొబైల్ ఫోన్లలో పాటలు, వీడియోలు ప్లే చేస్తూ శబ్ద కాలుష్యాన్ని సృష్టిస్తున్నారని, తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తున్నారని, దీనిపై ఆంక్షలు విధించాలని కోరుతూ వేసిన పిటిషన్‌‌పై హైకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. హెచ్చు వాల్యూమ్‌లో పాటలు ప్లే చేయవద్దని, ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దని అధికారులు బస్సు ప్రయాణికులకు సూచించాలని కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను ప్రయాణికులు బేఖాతరు చేస్తే వారిని వెంటనే బస్సు నుంచి అధికారులు దించివేయాలని స్పష్టం చేసింది.

Updated Date - 2021-11-12T21:58:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising