ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్మా థెరపీ, రెమ్‌డెసివిర్‌తో మ్యుటేషన్ల ముప్పు

ABN, First Publish Date - 2021-05-14T07:20:23+05:30

విచ్చలవిడి ప్లాస్మా చికిత్స, రెమ్‌డెసివిర్‌ వినియోగంతో కరోనా వైర్‌సలో ఉత్పరివర్తనాలు వచ్చి, మరింత బలోపేతమయ్యే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మాజీ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వైరస్‌ మరింత బలోపేతమయ్యే ప్రమాదం

అవి టీకా రక్షణకూ లొంగకపోవచ్చు

ఐసీఎంఆర్‌ మాజీ శాస్త్రవేత్త ఆందోళన


న్యూఢిల్లీ, మే 13: విచ్చలవిడి ప్లాస్మా చికిత్స, రెమ్‌డెసివిర్‌ వినియోగంతో కరోనా వైర్‌సలో ఉత్పరివర్తనాలు వచ్చి, మరింత బలోపేతమయ్యే ప్రమాదం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ రమణ్‌ గంగాఖేడ్కర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ఒకవైపు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ దాడితో వైర్‌సలో ఉత్పరివర్తనాలు వచ్చే ముప్పుంటుంది. దానికితోడు సమయం, సందర్భం లేకుండా రెమ్‌డెసివిర్‌, ప్లాస్మా థెరపీని విచ్చలవిడిగా వినియోగిస్తే వైరస్‌ మరింత శక్తిమంతమవుతుంది’’ అని ఆయన వివరించారు. ఇలా జరగకుండా ప్రభుత్వం వైద్యులకు, ఆస్పత్రులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని.. ప్లాస్మా థెరపీని, రెమ్‌డెసివిర్‌ వినియోగాన్ని హేతుబద్ధం చేయాలని రమణ్‌ సూచించారు.


‘‘భారత్‌లో పెద్ద సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారు. వారికి ఇలా విచ్చలవిడి చికిత్సలు చేస్తే వైర్‌సలో వచ్చే మ్యుటేషన్లు వ్యాక్సిన్ల వల్ల వచ్చే రక్షణ వ్యవస్థను కూడా తప్పించుకునేవిగా ఉండే ప్రమాదం ఉంది. అది ప్రపంచానికీ ప్రమాదమే. వైరస్‌ విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ సెకండ్‌ వేవ్‌లో నిరూపితమైన చికిత్సలకు మాత్రమే పరిమితం కాకపోతే కొత్త వేరియంట్లకు భారత్‌ బ్రీడింగ్‌ గ్రౌండ్‌గా మారుతుంది’’ అని హెచ్చరించారు.

Updated Date - 2021-05-14T07:20:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising