ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్‌లో చేరికకు ముహుర్తం ఫిక్స్..!

ABN, First Publish Date - 2021-08-06T07:45:43+05:30

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారా..?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • కాంగ్రెస్‌ పార్టీలోకి పీకే?
  • పార్లమెంటు వర్షాకాల సమావేశాల తర్వాత చేరిక!
  • అమరిందర్‌ ప్రధాన సలహాదారు పదవికి రాజీనామా
  • బెంగాల్‌ తర్వాత ఎన్నికల వ్యూహాలకు దూరం


చండీగఢ్‌, ఆగస్టు 5: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారా? అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినబడుతోంది. పంజాబ్‌ సీఎం అమరీందర్‌సింగ్‌ ప్రధాన సలహాదారు పదవి కి ప్రశాంత్‌ కిశోర్‌ గురువారం రాజీనామా చేశారు. తాత్కాలికంగా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నట్లు చెప్పారు. తన భవిష్యత్తు కార్యాచరణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 2017 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహకర్తగా  పనిచేశారు. ఆ పార్టీ అప్పట్లో విజయం సాధించింది. అనంతరం జేడీయూలో చేరారు. అయితే, 2020లో బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను జేడీయూ తొలగించింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన తర్వాత ప్రశాంత్‌ కిశోర్‌ కాంగ్రె్‌సలో చేరతారని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటికే ఆయన ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ప్రియాంకలతో చర్చలు జరిపారు.  సోనియా గాంధీ కూడా వర్చువల్‌ పద్ధతిలో ఈ సమావేశంలో పాల్గొన్నా రు. పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశారు. ఆ పార్టీ గెలిచింది. తర్వాత ఎన్నికల వ్యూహాలకు ఆయన దూరంగా ఉన్నారు. 

Updated Date - 2021-08-06T07:45:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising