ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షమాపణ చెప్పండి: సస్పెండెడ్ ఎంపీలకు కోరిన పీయూష్

ABN, First Publish Date - 2021-12-01T00:10:19+05:30

వర్షాకాల సమావేశాల చివరిరోజున మీ (సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలు) ప్రవర్తన నాకింకా గుర్తుంది. ఆ సమయంలో కొంత మంది ఎంపీలు మహిళా మార్షల్స్‌పై కొంత మంది ఎంపీలు పురుష మార్షల్స్‌పై దాడికి దిగారు. సభలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని స్థాయిలో ప్రవర్తించారు. దీనిపై ఒక కమిటీ వేశాం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రాజ్యసభలో గందరగోళం సృష్టించారనే కారణంతో ప్రతిపక్ష పార్టీకలకు చెందిన 12 మంది ఎంపీలను పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలిరోజునే సస్పెండ్ చేశారు. అయితే సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలు పార్లమెంట్‌కు క్షమాపణలు చెప్పాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సభలో మహిళా మార్షల్స్‌ మీద దాడికి పాల్పడ్డారని, వెల్‌లోకి ప్రవేశించి సభా కార్యకలాపాలు కొనసాగకుండా అడ్డుకున్నారని పీయూష్ అన్నారు.


‘‘వర్షాకాల సమావేశాల చివరిరోజున మీ (సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలు) ప్రవర్తన నాకింకా గుర్తుంది. ఆ సమయంలో కొంత మంది ఎంపీలు మహిళా మార్షల్స్‌పై కొంత మంది ఎంపీలు పురుష మార్షల్స్‌పై దాడికి దిగారు. సభలో ఏం జరుగుతుందో కూడా అర్థం కాని స్థాయిలో ప్రవర్తించారు. దీనిపై ఒక కమిటీ వేశాం. ఇందులో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారు. సభలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో కమిటీయే నిర్ధారిస్తుంది’’ అని మంగళవారం లోక్‌సభలో పీయూష్ అన్నారు.

Updated Date - 2021-12-01T00:10:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising