ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jaisalmerలో కూలిన మిగ్-21 ఐఎఎఫ్ విమానం...పైలట్ మృతి

ABN, First Publish Date - 2021-12-25T12:55:03+05:30

రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఐఏఎఫ్ మిగ్-21 విమానం కుప్పకూలిన ప్రమాద ఘటనలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జై సల్మేర్ : రాజస్థాన్ రాష్ట్రంలోని జైసల్మేర్‌లో ఐఏఎఫ్ మిగ్-21 విమానం కుప్పకూలిన ప్రమాద ఘటనలో పైలట్ మృతి చెందారు.శుక్రవారం రాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లోని ఇసుక తిన్నెల్లో ఐఎఎఫ్ మిగ్ విమానం కుప్పకూలింది.ఈ ప్రమాదంలో పైలట్ వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మరణించాడు.జైసల్మేర్‌లోని ఇండో-పాక్ సరిహద్దు సమీపంలోని సుదాసిరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.సామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డెసర్ట్ నేషనల్ పార్క్ ప్రాంతంలో విమానం కూలిపోయిందని జైసల్మేర్ ఎస్పీ అజయ్ సింగ్ తెలిపారు.స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని ఎస్పీ తెలిపారు.‘‘శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఐఎఎఫ్ యొక్క మిగ్-21 విమానం శిక్షణ సమయంలో పశ్చిమ సెక్టార్‌లో ఎగురుతూ ప్రమాదానికి గురైంది.ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.


ఈ విమాన ప్రమాదంలో వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా మరణించారు’’ అని సామ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ దల్పత్ సింగ్ తెలిపారు.విమానంలో మంటలు చెలరేగడం తాను చూశానని ఎడారి జాతీయ ఉద్యానవనానికి సమీపంలోని ఒక కుగ్రామంలో నివసిస్తున్న ప్రత్యక్ష సాక్షి చెప్పారు. విమానం నేలను ఢీకొనక ముందే మంటలు అంటుకున్నాయని ఆయన పేర్కొన్నారు.వింగ్ కమాండర్ హర్షిత్ సిన్హా కుటుంబానికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా సంతాపం తెలిపారు. రాజస్థాన్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రా కూడా ఐఏఎఫ్ పైలట్ మృతికి సంతాపం తెలుపుతూ ప్రకటన విడుదల చేశారు.


Updated Date - 2021-12-25T12:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising