ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇంద్రభవనాల్లో పందుల పెంపకం!

ABN, First Publish Date - 2021-08-03T07:11:01+05:30

అదో 13 అంతస్తుల భవనాల సముదాయం. పటిష్ఠమైన భద్రత. ఆరోగ్య సదుపాయాలు. అన్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 క్రిములు, వ్యాధుల నుంచి కాపాడుకునేందుకు చైనా జాగ్రత్తలు


బీజింగ్‌, ఆగస్టు 2: అదో 13 అంతస్తుల భవనాల సముదాయం.  పటిష్ఠమైన భద్రత. ఆరోగ్య సదుపాయాలు. అన్ని రకాల జాగ్రత్తలతో తయారవుతున్న వంటకాలు. ఈ పనులన్నీ నిర్వర్తించడానికి రోబోల వినియోగం. ఈ పటిష్ఠమైన ఏర్పాట్లన్నీ పందుల కోసమండీ. చైనీయుల ప్రధాన ఆహారం.. పంది మాంసం. మూడేళ్ల క్రితం ఆ దేశంలో విస్తరించిన ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ.. 40 కోట్లకు పైగా పందుల్ని తుడిచిపెట్టేసింది. దీంతో దేశీయంగా పందుల పెంపకం పడిపోయింది. దీంతో.. వారు తమ ప్రధాన ఆహారం కోసం అమెరికా, యూరోప్‌ దేశాలపై పూర్తిగా ఆధారపడాల్సి వచ్చిం ది.


ఇదే అదనుగా ఆయా దేశాలు.. పంది మాంసం ధరలను భారీ గా పెంచేశాయి. దీనికి ఎబోలా, కరోనా వ్యాప్తి కూడా తోడవడంతో.. ఆ దేశంలో ఆర్థిక మాంద్యం తీవ్రమైంది. దీన్ని ఎదుర్కొనేందుకు.. సురక్షితమైన, నాణ్యత కలిగిన క్రిమి రహిత పంది మాంసాన్ని దేశీయంగా ఉత్పత్తి చేయాలని చైనా సంకల్పించింది. ఈ క్రమంలో.. బడా పారిశ్రామిక వేత్తలు ఎలాంటి సూక్ష్మజీవులూ ప్రవేశించడానికి అవకాశం లేని రక్షణాత్మకమైన భవనాలను నిర్మించి.. అందులో పందులను పెంచడం మొదలు పెట్టారు. ఇటీవలే ఇక్కడ 15 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ భారీ కార్పొరేట్‌ పందుల పెంపక కేంద్రం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఇక్కడ ఏడాదికి 1.2 లక్షల పందుల్ని పెంచనున్నారు.


Updated Date - 2021-08-03T07:11:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising