ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సినిమా ఇంకా మిగిలే ఉంది: ఆర్యన్ బెయిల్ అనంతరం నవాబ్ మాలిక్

ABN, First Publish Date - 2021-10-29T16:27:56+05:30

శుక్రవారం మరోసారి తన మాటల తూటాల్ని సంధించారు నవాబ్ మాలిక్. ఆర్యన్‌ను జైలుకు పంపిన వ్యక్తి ఇప్పుడు జైలులో ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. ‘‘పరిస్థితి ఎంతలా మారిపోయిందో ఇప్పుడు మీరు చూడొచ్చు. ఏ వ్యక్తైతే ఆర్యన్‌ ఖాన్‌ను ఎన్సీబీ ఆఫీస్‌కు ఈడ్చుకొచ్చాడో ఇప్పుడు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: షారూఖ్ తనయుడు ఆర్యన్‌కు బెయిల్ వచ్చిన అనంతరం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేత నవాబ్ మాలిక్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ‘పిక్చర్ అబి బాకీ హై మేరే దోస్త్’ (సినిమా ఇంకా మిగిలే ఉంది మిత్రమా) అంటూ ఆయన చేసిన ట్వీట్‌ రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. ఆర్యన్‌ అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తిని ఉద్దేశించే నవాబ్ మాలిక్ ట్వీట్ చేశారని నెటిజెన్లతో పాటు మీడియా కూడా రిపోర్ట్ చేసింది. కాగా, ఆ మీడియా రిపోర్ట్‌లను నవాబ్ మాలిక్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడం విశేషం.


కాగా, శుక్రవారం మరోసారి తన మాటల తూటాల్ని సంధించారు నవాబ్ మాలిక్. ఆర్యన్‌ను జైలుకు పంపిన వ్యక్తి ఇప్పుడు జైలులో ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు. ‘‘పరిస్థితి ఎంతలా మారిపోయిందో ఇప్పుడు మీరు చూడొచ్చు. ఏ వ్యక్తైతే ఆర్యన్‌ ఖాన్‌ను ఎన్సీబీ ఆఫీస్‌కు ఈడ్చుకొచ్చాడో ఇప్పుడు ఆ వ్యక్తే కటకటాల వెనుక ఉన్నాడు. ఆర్యన్‌ను అతడి మిత్రుల్ని బెయిల్ రాకుండా ఉండడానికి ఆ వ్యక్తి ఎన్ని చేయాలో అన్నీ చేశాడు. కానీ ఇప్పుడు అతడే బెయిల్ కోసం కోర్టు తలుపులు తడుతున్నాడు’’ అని నవాబ్ మాలిక్ అన్నారు.

Updated Date - 2021-10-29T16:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising