ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫైజర్ కంపెనీ సీఈఓ కీలక ప్రకటన!

ABN, First Publish Date - 2021-06-23T02:51:52+05:30

ఫైజర్‌ కరోనా టీకాకు సంబంధించి అత్యవసర అనుమతుల జారీ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుందని కంపెనీ సీఈఓ ఆల్బర్ట్‌ బోర్లా మంగళవారం నాడు ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఫైజర్‌ కరోనా టీకాకు సంబంధించి అత్యవసర అనుమతుల జారీ ప్రక్రియ చివరి అంకానికి చేరుకుందని కంపెనీ సీఈఓ ఆల్బర్ట్‌ బోర్లా మంగళవారం నాడు ప్రకటించారు. ‘‘త్వరలోనే ఒప్పందానికి తుది రూపు వస్తుంది’’ అని కామెంట్ చేశారు. జర్మనీ బయోటెక్ సంస్థ బయోఎన్‌టెక్, ఆమెరికా ఫార్మా సంస్థ ఫైజర్ సంయుక్తంగా ఈ టీకా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. ఎమ్‌ఆర్ఎన్ఏ టెక్నాలజీ ఆధారంగా తయారైన ఈ టీకా ప్రభావశీలత 90 శాతానికి పైనే ఉంటుందని ఇటీవల జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. ఇక ఇండెమ్నిటీ రక్షణ విషయంలో భారత ప్రభుత్వం, ఫైజర్ మధ్య కొంత కాలం క్రితం అభిప్రాయభేదాలు పొడచూపాయి. అయితే..కరోనా సంక్షోభం తీవ్రత దృష్ట్యా టీకా కంపెనీలకు కొన్ని మినహాయింపులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయమై మరింత స్పష్టత రావాల్సి ఉంది. 

Updated Date - 2021-06-23T02:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising