ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒమైక్రాన్‌‌పై యుద్ధానికి ప్ఫైజర్ సిద్ధం

ABN, First Publish Date - 2021-11-27T20:22:26+05:30

దక్షిణాఫ్రికాలో కనిపించిన కోవిడ్-19 వైరస్ కొత్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దక్షిణాఫ్రికాలో కనిపించిన కోవిడ్-19 వైరస్ కొత్త స్ట్రెయిన్‌కు సుమారు 100 రోజుల్లో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తామని ప్ఫైజర్ ప్రకటించింది. ప్రస్తుతం తాము తయారు చేస్తున్న వ్యాక్సిన్ ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్‌ను కట్టడి చేసేందుకు పనికొస్తుందో, లేదో తమ పరిశోధకులు పరీక్షలు చేస్తున్నారని తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ కొత్త స్ట్రెయిన్‌కు ‘ఒమైక్రాన్’ అని పేరు పెట్టింది. 


ప్ఫైజర్ శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, దక్షిణాఫ్రికాలో కనిపించిన కోవిడ్-19 వైరస్ కొత్త స్ట్రెయిన్‌కు సుమారు 100 రోజుల్లో వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు ప్ఫైజర్, తన జర్మన్ భాగస్వామి బయోఎన్‌టెక్‌తో కలిసి కృషి చేస్తుంది. ప్రస్తుత వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేయకపోతే, కొత్తగా ఓ వ్యాక్సిన్‌ను అభివృద్ధిపరుస్తారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షల ఫలితాలు రెండు వారాల్లోగా అందుతాయని ప్ఫైజర్ భావిస్తోంది.


అమెరికాలో కొత్త వ్యాక్సిన్‌ను ప్రజలకు ఇవ్వాలంటే ప్రభుత్వ అనుమతి అవసరమవుతుంది. అత్యవసర వినియోగం కోసం ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి ఇవ్వాలి. ఒమైక్రాన్ వ్యాప్తిని ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా అమెరికా ఆరోగ్యం, మానవ సేవల శాఖ కార్యదర్శి ప్రకటించవలసి ఉంటుంది. ప్ఫైజర్, బయోఎన్‌టెక్ ప్రస్తుత వ్యాక్సిన్‌కు అనుమతి పొందడానికి దాదాపు 9 నెలల సమయం పట్టింది. 


గతంలో కనిపించిన వైరస్ స్ట్రెయిన్స్ కన్నా ఒమైక్రాన్‌కు ఎక్కువ రూపాంతరాలు ఉన్నట్లు దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖాధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్‌కు వ్యాపించే లక్షణం ఎక్కువగా ఉందన్నారు. అంతేకాకుండా ప్రస్తుత వ్యాక్సిన్లను తట్టుకోగలదని పేర్కొన్నారు. గతంలో డెల్టా వేరియంట్ మాదిరిగా కానీ, అంత కన్నా ఎక్కువగా కానీ వ్యాపించగలదని చెప్పారు. 


ఒమైక్రాన్ ఆందోళన కలిగించే వేరియంట్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం ప్రకటించింది. రీఇన్ఫెక్షన్ రిస్క్ అధికంగా ఉందని తాజా ఆధారాలు వెల్లడిస్తున్నట్లు తెలిపింది. 


Updated Date - 2021-11-27T20:22:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising