ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో భారీగా తగ్గిన పెట్రోలు ధర

ABN, First Publish Date - 2021-12-01T18:04:07+05:30

ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించడంతో లీటరు పెట్రోలు ధర రూ.8 వరకు తగ్గింది. సవరించిన ధరలు బుధవారం-గురువారం అర్ధ రాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. కేజ్రీవాల్ నేతృత్వంలో బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 


ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.103.97 కాగా దీనిలో సుమారు రూ.8 వరకు తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం నవంబరు మొదటివారంలో దీపావళి పండుగ సందర్భంగా పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిన సంగతి తెలిసిందే. లీటరు పెట్రోలుపై రూ.5, లీటరు డీజిల్‌పై రూ.10 చొప్పున ఎక్సయిజ్ సుంకాన్ని తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాట్‌ను తగ్గించి, ప్రజలకు ప్రయోజనం కల్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 


గడచిన 15 రోజుల్లో అంతర్జాతీయ ఇంధనం ధరల సగటు, విదేశీ మారక ద్రవ్యం రేట్లు ఆధారంగా మన దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలను ప్రతి రోజూ సవరిస్తూ ఉంటారు. 


Updated Date - 2021-12-01T18:04:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising