ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో ధరలు... తగ్గేదే లే!

ABN, First Publish Date - 2021-09-18T02:50:18+05:30

పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి రావటం లేదు. మరోసారి సామాన్యుడికి నిరాశ ఎదురయ్యేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. లక్నోలో జరిగిన 45వ కౌన్సిల్ మీటింగ్‌కి ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. కాగా సమావేశంలో పాల్గొన్న సభ్యులు పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు అంగీకరించలేదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి రావటం లేదు. మరోసారి సామాన్యుడికి నిరాశ ఎదురయ్యేలా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. లక్నోలో జరిగిన 45వ కౌన్సిల్ మీటింగ్‌కి ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. కాగా సమావేశంలో పాల్గొన్న సభ్యులు పెట్రోల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి తీసుకు వచ్చేందుకు అంగీకరించలేదు. అయితే, అంతకు ముందు ఇదే అంశంపై కౌన్సిల్‌లో చర్చ మాత్రం జరిగింది. గతంలో కేరళ హైకోర్టు కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించాలంటూ ఆదేశించటంతో ఇప్పుడు పెట్రోల్, డీజిల్ అంశాన్ని ఎజెండాలో చేర్చారు. కానీ, కామన్ మ్యాన్‌కి ఊరటనిచ్చే డిజీషన్ మాత్రం తీసుకోలేకపోయారు.


కరోనా సంబంధమైన ఔషధాల ధరలు మాత్రం యధాతథంగా ఉండనున్నాయి. డిసెంబర్ 31 వరకూ వాటిపై తగ్గింపు జీఎస్టీ ధరలు కొనసాగనున్నాయి. అలాగే, క్యాన్సర్‌ వైద్యంలో వాడే కొన్ని మందుల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది కౌన్సిల్. ఇకపై ఆయా మెడిసిన్స్ 12 శాతం శ్లాబ్ నుంచీ 5 శాతం జీఎస్టీ శ్లాబ్‌లోకి వస్తాయి.     

     

Updated Date - 2021-09-18T02:50:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising