ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rescue : బావిలో పడి నలుగురి దుర్మరణం...పలువురి గల్లంతు

ABN, First Publish Date - 2021-07-16T12:48:43+05:30

ప్రమాదవశాత్తు బావిలో పడి నలుగురు దుర్మరణం చెందిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విధిషా (మధ్యప్రదేశ్): బావిలో పడిన బాలుడిని కాపాడబోయి నలుగురు దుర్మరణం చెందిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విధిషా పట్టణ సమీపంలోని గంజ్ బసోడా గ్రామంలో వెలుగుచూసింది. బాలుడిని రక్షించడానికి పలువురు గ్రామస్థులు వచ్చి బావి పైకప్పుపై నిలబడ్డారు. అంతలో బావి పైకప్పు కూలిపోవడంతో 40 మంది బావిలో పడిపోయారు. వీరిలో 19 మందిని సహాయ సిబ్బంది రక్షించారు. ఇప్పటివరకూ నలుగురి మృతదేహాలను వెలికితీశారు. బావి లోతు 50 అడుగులుందని అధికారులు చెప్పారు.


బావిలో పడిన వారిలో పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట్ర విపత్తు నిర్వహణ దళాలు రంగంలోకి దిగి సహాయ చర్యలు చేపట్టాయి. పోలీసు ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వచ్చి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. బావిలో ప్రజలు పడిన దుర్ఘటనలో సహాయ చర్యలు చేపట్టామని మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. బావిలో పడిన బాధితులకు తక్షణ చికిత్స అందించాలని సీఎం ఆదేశించారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తు జరపాలని సీఎం చౌహాన్ అధికారులను కోరారు. 


Updated Date - 2021-07-16T12:48:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising