ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెగాసస్‌పై సుప్రీం తీర్పులో.. పత్రికా స్వేచ్ఛకు పట్టం

ABN, First Publish Date - 2021-10-29T08:23:32+05:30

పెగాసస్‌ వ్యవహారంపై స్వతంత్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు.. ఈ మేరకు ఇచ్చిన తీర్పులో పత్రికా స్వేచ్ఛకు పట్టంగట్టింది. జర్నలిస్టులపై నిఘా వేయడమంటే.. పత్రికలు పోషించే పర్యవేక్షక పాత్రపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెండు పాత తీర్పులను ఉదాహరించిన ధర్మాసనం.. నిరంతర నిఘాతో హక్కుల వినియోగంపై ప్రభావం

బాధ్యతాయుత ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను గౌరవించాలి: సుప్రీం కీలక వ్యాఖ్యలు

పత్రికలపై కత్తి వేలాడనీయకూడదని స్పష్టం


న్యూఢిల్లీ, అక్టోబరు 28: పెగాసస్‌ వ్యవహారంపై స్వతంత్ర విచారణకు కమిటీని ఏర్పాటు చేసిన సుప్రీం కోర్టు.. ఈ మేరకు ఇచ్చిన తీర్పులో పత్రికా స్వేచ్ఛకు పట్టంగట్టింది. జర్నలిస్టులపై నిఘా వేయడమంటే.. పత్రికలు పోషించే పర్యవేక్షక పాత్రపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా కోర్టు రెండు పాత తీర్పులను ఉదాహరించింది. వాటిలో ఒకటి 1985 నాటి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు. ఆ కేసులో సుప్రీంకోర్టు పత్రికాస్వేచ్ఛకు సంబంధించి పేర్కొన్న అంశాలను తీర్పులో ప్రస్తావించింది. స్వేచ్ఛాయుత రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాల్లోనూ పత్రికాస్వేచ్ఛను ఆయా రాజ్యాంగాల్లో పొందుపరచడం కోసం కఠినమైన, గొప్ప సంఘర్షణలు జరిగాయని.. గణనీయమైన త్యాగాలు, వేదనల ఫలితంగానే ఆయా లిఖితపూర్వక రాజ్యాంగాల్లో పత్రికా స్వేచ్ఛ పొందుపరచబడిందని నాటి తీర్పులో పేర్కొన్న విషయాన్ని జస్టిస్‌ రమణ నేతృత్వంలోని ధర్మాసనం గుర్తుచేసింది. ‘‘ఎవరో ఒకరు తమపై నిఘా పెట్టారన్న విషయం తెలిస్తే.. అది వ్యక్తులు తమ హక్కులను వినియోగించుకునే తీరుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా.. ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో ఒకటైన పత్రికా స్వేచ్ఛ విషయంలో ఇది ఆందోళన కలిగించే విషయం. పర్యవేక్షణ పాత్ర పోషించే పత్రికలపై దాని భయానక ప్రభావం పడుతుంది. ఫలితంగా కచ్చితమైన, నమ్మకమైన సమాచారాన్ని అందించేసామర్థ్యం పత్రికలకు కొరవడుతుంది’’ అని ధర్మాసనం పేర్కొంది. అలాగే.. 2020నాటి అనురాధ భాసిన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు విచారణ సందర్భంగా ఆధునిక ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యత గురించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ఉటంకించింది.


‘‘బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను అన్ని వేళలా గౌరవించాలి. పత్రికలపై నిరవధికంగా కత్తిని వేలాడనీయకూడదు’’ అని ఆ తీర్పులో నాడు సుప్రీంకోర్టు పేర్కొన్న విషయాన్ని గుర్తుచేసింది. పత్రికలకు అలాంటి ముఖ్యమైన స్వేచ్ఛను, హక్కును కల్పించడం వల్ల సమాచార మూలాలను (సోర్సులను) కాపాడుకోవడం సాధ్యమవుతుందని పేర్కొంది. సోర్సును కాపాడుకోవడం పత్రికాస్వేచ్ఛ విషయంలో మౌలికమైన అంశమని స్పష్టం చేసింది. మొత్తం 46 పేజీల తీర్పులో సుప్రీంకోర్టు నాలుగు పారాగ్రా్‌ఫలు పత్రికా స్వేచ్ఛ గురించే ప్రముఖంగా ప్రస్తావించడం.. పత్రికా స్వేచ్ఛ ఆవశ్యకతను నొక్కి చెప్పడం గమనార్హం. భవిష్యత్తులో ఈ అంశానికి సంబంధించి ఏ కేసు వచ్చినా.. ఈ తీర్పును ఉటంకించే స్థాయిలో ఉందని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-10-29T08:23:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising