ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Supreme Court: రాజకీయ పార్టీలకు సంచలన ఆదేశాలు

ABN, First Publish Date - 2021-08-10T17:11:11+05:30

దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అభ్యర్థుల నేర చరిత్ర ప్రచురించాలి

న్యూఢిల్లీ : దేశంలోని అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలకు మంగళవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులు ఎంపికైన 48 గంటల లోపు వారి క్రిమినల్ పూర్వాపరాలను ప్రచురించాలని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. 2020 ఫిబ్రవరి తీర్పులోని పేరా 4.4 లో అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటలలోపు లేదా నామినేషన్ల దాఖలుకు మొదటితేదీకి రెండు వారాల ముందు వారి నేరరికార్డులను ప్రకటించాలని సుప్రీం ఆదేశించింది.


గత ఏడాది నవంబరులో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల నేర పూర్వపరాలను ప్రచురించడంలో పార్టీలు విఫలమైనందుకు దాఖలు చేసిన ధిక్కార పిటిషన్లలో సుప్రీం బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, బిఆర్ గవాయ్ లతో కూడిన ధర్మాసనం 2020 ఫిబ్రవరి 13 న ఇచ్చిన తీర్పును సవరించింది.బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో ముడిపడి ఉన్న ఫిబ్రవరి తీర్పులో, అభ్యర్థులు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి మొదటి తేదీకి కనీసం 48 వారాల ముందు లేదా ఈ వివరాలను అప్‌లోడ్ చేయాలని ఆదేశించింది.


Updated Date - 2021-08-10T17:11:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising