ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క‌రోనా నుంచి కోలుకున్నాక పారోస్మియా... ఆహారం కుళ్లు కంపు కొడుతోంద‌ట‌!

ABN, First Publish Date - 2021-06-20T12:36:55+05:30

కరోనా నుంచి కోలుకున్న కొంత‌మంది బాధితులు రుచి, వాసన శ‌క్తులను...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న కొంత‌మంది బాధితులు రుచి, వాసన శ‌క్తులను కోల్పోవ‌డానికి తోడు వింత సమస్యల‌ను ఎదుర్కొంటున్నారు. తాము ఆహారం తీసుకున్న‌ప్పుడు అది బాగున్న‌ప్ప‌టికీ దాని నుంచి రసాయనాల వాస‌న లేదా కుళ్లు కంపు వ‌స్తున్న‌ట్టు అనుభూతి చెందుతున్నామ‌ని ప‌లువురు బాధితులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న బాధితుల‌లో త‌లెత్తే ఇటువంటి పరిస్థితిని వైద్య ప‌రిభాషలో పారోస్మియా అంటార‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ స‌మ‌స్య‌కు లోన‌యిన‌వారు వాస‌న‌ల‌ను భిన్నంగా అనుభూతి చెందుతారు. ఫ‌లానా వస్తువుకు గ‌ల‌ వాసన ఏమిటో చెప్ప‌లేక‌పోతారు.  ఈ స‌మ‌స్య గురించి బీహెచ్‌యూ న్యూరాలజీ ప్రొఫెసర్ అజ‌య్ నాథ్ మిశ్రా మాట్లాడుతూ  పారోస్మియాకు ఒక కారణం జలుబు లేదా వైరస్  అని అన్నారు. ఈ కారణంగా ఘ్రాణ (వాసన సామర్ధ్యం) దెబ్బతింటుంద‌ని వివరించారు. శ్వాసకోశ ఎగువ భాగంలో సంక్రమణ కారణంగా ఘ్రాణ న్యూరాన్లు దెబ్బతింటాయి. వృద్ధులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. సిగరెట్లు తాగేవారికి కూడా ఇలాంటి సమస్యలు త‌లెత్తుతాయి. అయితే ఇటువంటి స‌మ‌స్య నుంచి బాధితులు మెల్ల‌మెల్ల‌గా కోలుకుంటార‌న్నారు.

Updated Date - 2021-06-20T12:36:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising