ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నై నగరానికి పారా మిలిటరీ బలగాలు

ABN, First Publish Date - 2021-02-26T13:08:32+05:30

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్నికల భద్రత విధుల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/ప్యారీస్ (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్నికల భద్రత విధుల్లో పాల్గొనేందుకు పలు రాష్ట్రాల నుంచి పారా మిలిటరీ బలగాలను రాష్ట్రానికి పంపించేందుకు కేంద్రప్రభుత్వం అనుమతించిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు ఇటీవల ప్రకటించారు. ఆ మేరకు గురువారం రాష్ట్ర ఎన్నికల భద్రత పనుల్లో పాల్గొనేందుకు తొలివిడతగా కర్ణాటక రాష్ట్రం మంగళూరు నుంచి పారా మిలిటరీ బలగాలకు చెందిన 92 మంది సైనికులు రైలు ద్వారా చెన్నై చేరుకున్నారు. వీరు వెంటనే సెంట్రల్‌ నుంచి కృష్ణగిరి జిల్లాకు బయల్దేరి వెళ్లారు. ఆ జిల్లాలో స్థానిక పోలీసులతో కలిసి సమస్యాత్మకమైన పోలింగ్‌ కేంద్రాల్లో భద్రత విధుల్లో పాల్గొంటారు. తదుపరి విడతగా 45 కంపెనీల బలగాలు రాష్ట్రానికి రానున్నాయని, ఇందులో తొలివిడతగా ఒక కంపెనీకి చెందిన  60 మంది నగరంలోనే విడిది చేస్తారని, ఇప్పటికే నగరంలో శాంతిభద్రతల విభాగానికి చెందిన 12 మంది అసిస్టెంట్‌ కమిషనర్లతో కలిసి వీరు విధుల్లో పాల్గొంటారని ఎన్నికల సంఘం తెలిపింది.

Updated Date - 2021-02-26T13:08:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising