ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిండుకుండలా పరగోడు డ్యామ్‌

ABN, First Publish Date - 2021-11-19T18:02:54+05:30

చిక్కబళ్ళాపుర జిల్లాలో రెండు దశాబ్దాల తర్వాత సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, బావులు జలకళ సంతరించుకున్నాయి. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలతో బాగేపల్లి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాగేపల్లి(బెంగళూరు): చిక్కబళ్ళాపుర జిల్లాలో రెండు దశాబ్దాల తర్వాత సమృద్ధిగా వర్షాలు కురుస్తుండడంతో చెరువులు, బావులు జలకళ సంతరించుకున్నాయి. రెండు నెలలుగా కురుస్తున్న భారీ వర్షాలతో బాగేపల్లి తాలూకాలోని పరగోడు డ్యామ్‌ జలకళ సంతరించుకుంది. డ్యామ్‌ నుంచి నీరు ప్రవహిస్తున్న ఫొటోలు కొందరు డ్రోన్‌ కెమెరాతో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేయగా గురువారం వైరల్‌ అయ్యింది. కాగా బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో బాగేపల్లి, గుడిబండ తాలూకాలలో జోరు వర్షం కురుస్తోంది. నందికొండల నుంచి వస్తున్న వర్షపునీటితో పలు చెరువులు, కుంటలు నిండి చిత్రావతికి చేరుతున్నాయి. ఇన్‌ఫ్లో పెరగడంతో డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేశారు. పరగోడు ప్రాజెక్టునుంచి తీమాకలపల్లి, జిలకరపల్లి మీదుగా నీరు ప్రవహిస్తోంది. మరవపారుతున్న నీటిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు, పొరుగు ప్రాంతాలవారు తరలివస్తున్నారు. ప్రాజెక్టును చూసేందుకు వచ్చేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని దేవరెడ్డిపల్లి గ్రామస్తుడు భాస్కరరెడ్డి అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-11-19T18:02:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising