ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

POKలో యురేనియం కోసం పాక్ అక్రమ తవ్వకాలు

ABN, First Publish Date - 2021-09-19T00:08:19+05:30

పాక్ అక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్‌లో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు పాక్ సర్కారు కసరత్తు ప్రారంభించినట్లు స్థానిక ప్రజలు, నాయకుల ద్వారా నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాక్ అక్రమిత కశ్మీర్ (పీఓకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్‌లో అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించి యురేనియం తవ్వకాలు చేపట్టేందుకు పాక్ సర్కారు కసరత్తు ప్రారంభించినట్లు స్థానిక ప్రజలు, నాయకుల ద్వారా నిర్ధారణ అయ్యింది. అటామిక్ ఎనర్జీ మెటీరియల్ సెంటర్ (ఏఈఎమ్‌సీ)కు చెందిన పాక్ అధికారులు గిల్గిత్-బాల్టిస్తాన్‌లోని హైదరాబాద్ ప్రాంతాన్ని పరిశీలించారని వారు తెలిపారు. దీనితో పాటు ఖైబర్-పఖ్తుంఖ్వా ఫ్రావిన్స్‌లో యురేనియం ఉందని గుర్తించిన ప్రాంతాలను కూడా వారు సందర్శించారని వివరించారు. గిల్గిత్-బాల్టిస్తాన్ ఉన్న సహజవనరులను చైనా తవ్వుకోవడానికి గతంలోనే పాకిస్తాన్ ఒప్పుకుందని కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఈ ప్రాంతంలో ఉన్న బంగారం, యురేనియం, మోలిబ్డినం లాంటి ఖనిజాలను తవ్వుకోవడానికి చైనా సంస్థలకు పాకిస్తాన్ రాచబాట పరిచిందని ఆ నివేదికలు బయటపెట్టాయి.


పీఓకేకి చెందిన రాజకీయ నాయకుడు అంజాద్ అయూబ్ మీర్జా మీడియాకు సమాచారం ఇస్తూ.. ‘‘చైనాకు చెందిన జియాలజిస్టుల బృందం యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్న హంజా-నగర్ జిల్లాను సందర్శించింది. ఈ బృందంలో పాకిస్తాన్ వారు కూడా ఉన్నారు. ఈ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను గతంలోనే అసిఫ్ అలీ జర్దారీ ప్రభుత్వం చైనాకు లీజుకిచ్చింది. ఆ వివరాలను ఇప్పటి వరకు బహిరంగపరచలేదు. షహజాద్ ఇంటర్నేషనల్ అనే సంస్థ గిల్గిత్-బాల్టిస్తాన్‌లో యురేనియాన్ని తవ్వుతోంది.  చైనా యురేనియం తవ్వకాలు చేపడుతుండటంతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటోంది. పాకిస్తాన్ కూడా ఖైబర్-పఖ్తుంఖ్వా ఫ్రావిన్స్‌‌లో యురేనియం తవ్వకాలకు ఉన్న అవకాశాల గురించి పరిశీలిస్తోంది ’’ అని వివరించారు. పాకిస్తాన్ 2020లోనే యురేనియం తవ్వకాలను ప్రారంభించాలనుకుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.2416 మిలియన్లకు పైగా ధనాన్ని వెచ్చించాలనుకుంది. కానీ, అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు.

Updated Date - 2021-09-19T00:08:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising