ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ పావురాన్ని భారత్ వెనక్కి ఇచ్చేయాలి: పాక్ వాసి విన్నపం

ABN, First Publish Date - 2021-04-22T18:22:36+05:30

పాకిస్తాన్ సరిహద్దు నుంచి పంజాబ్‌ బోర్డర్‌కు వచ్చిన తన పావురాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్‌కు చెందిన హబీబుల్లా విజ్ఞప్తి చేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాకిస్తాన్ సరిహద్దు నుంచి పంజాబ్‌ బోర్డర్‌కు వచ్చిన తన పావురాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీకి పాకిస్థాన్‌కు చెందిన హబీబుల్లా విజ్ఞప్తి చేశాడు. ఈ నెల 17వ తేదీన పంజాబ్‌ బోర్డర్‌ వద్ద విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్ నీరజ్ కుమార్ భుజంపై ఓ పావురం వాలింది. ఆ పావురం కాలికి ఓ తెల్ల కాగితం కట్టి ఉండడంతో దానిని పోస్ట్ కమాండర్ ఒంపాల్ సింగ్‌కు అందించాడు. 


ఆ కాగితంపై ఏవో నెంబర్లు రాసి ఉన్నాయి. దానిని కోడ్ భాషగా భావించిన అధికారులు పావురాన్ని బంధించారు. అయితే ఆ పావురం తనదేనని పాకిస్థాన్‌కు చెందిన గ్రామస్థుడు హబీబుల్లా తాజాగా తెలిపాడు. సరిహద్దుకు 4 కి.మి దూరంలో ఉన్న ఓ గ్రామంలో నివసిస్తున్న హబీబుల్లా ఈద్ పండగా సందర్భంగా ఆ పావురాన్ని ఎగరేశాడట. ఆ పావురం కాలికి కట్టి ఉన్న కాగితంపై రాసి ఉన్నది తన మొబైల్ నెంబర్ అని, అది ఎలాంటి కోడ్ లాంగ్వేజ్ కాదని తెలిపాడు. ఆ పావురాన్ని తనకు తిరిగి ఇప్పించాల్సిందిగా భారత ప్రధానికి విజ్ఞప్తి చేశాడు. 

Updated Date - 2021-04-22T18:22:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising