ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించడంపై నిషేధం

ABN, First Publish Date - 2021-09-09T13:33:15+05:30

పాకిస్థాన్ దేశంలో ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించడాన్ని నిషేధించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ (పాకిస్థాన్): పాకిస్థాన్ దేశంలో ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించడాన్ని నిషేధించింది. మహిళా టీచర్లు జీన్స్ లేదా టైట్ గా ఉండే దుస్తులు ధరించవద్దని పాక్ ఆదేశించింది.పురుష ఉపాధ్యాయులు ప్యాంట్, షర్టులు ధరించాలని, మహిళా టీచర్లు షల్వార్ కమీజ్ ధరించాలని పాకిస్థాన్ ఫెడరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.అదే నోటిఫికేషన్ లో పురుష ఉపాధ్యాయులు జీన్స్, టీ షర్టులు ధరించడాన్ని నిషేధించింది.దీనికి సంబంధించి తాజాగా పాఠశాలలు, కళాశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ డైరెక్టర్ ఒక లేఖ పంపించారు.ఉపాధ్యాయులు రెగ్యులర్ హెయిర్‌కట్ చేయడం, గడ్డం ట్రిమ్ చేయడం, నెయిల్ కటింగ్, షవర్, డియోడరెంట్ లేదా పెర్ఫ్యూమ్ ఉపయోగించడం వంటి మంచి చర్యలు పాటించాలని ఉపాధ్యాయులకు సూచించింది.


తరగతులు, లేబోరేటరీలలో ఉన్నప్పుడు టీచింగ్ సిబ్బంది అందరూ టీచింగ్ గౌన్లు ధరించాలని లేఖలో సిఫార్సు చేశారు. గేట్‌కీపర్లు,సహాయక సిబ్బంది యూనిఫామ్‌ ధరించాలని పాఠశాలలు, కళాశాలలకు సర్కారు నిర్దేశించింది. మహిళా ఉపాధ్యాయులు స్కార్ఫ్,హిజాబ్ ధరించడానికి అనుమతిస్తారు.ఫెడరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రాసిన లేఖలో పురుష టీచర్లు ప్యాంటు, టైతో షర్టు ధరించడం తప్పనిసరి అని పేర్కొంది.

Updated Date - 2021-09-09T13:33:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising