ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశ్వాస పరీక్షలో విజయం సాధించిన ఇమ్రాన్ ఖాన్

ABN, First Publish Date - 2021-03-06T19:52:04+05:30

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దీంతో ఆయన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. 178 ఓట్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ప్రధాని ఇమ్రాన్ ఖాన్ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. దీంతో ఆయన ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. 178 ఓట్ల మద్దతు ఆయనకు లభించింది. విశ్వాస పరీక్షలో ఆయన విజయం సాధించగానే ‘‘ఇమ్రాన్ ఖాన్ జిందాబాద్’  అన్న నినాదాలు ఒక్కసారిగా పార్లమెంట్‌లో మార్మోగాయి. విశ్వాస పరీక్ష నెగ్గడానికి ఆయనకు 171 ఓట్ల మద్దతు అవసరం ఉంది. కానీ 178 ఓట్ల మద్దతు లభించి, ఆయన విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. సెనెట్‌కు జరిగిన ఎన్నికల్లో ఇమ్రాన్ కేబినెట్‌లోని ఆర్థిక మంత్రి, ప్రతిపక్ష నేత చేతిలో అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. కేవలం ఏడంటే ఏడే ఓట్లతో ఓటమి చెందారు. దీంతో పాక్ రాజకీయాలు మారిపోయాయి. ఇమ్రాన్ ఖాన్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ప్రతిపక్షాలకు ముకుతాడు వేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌లో విశ్వాస పరీక్షను ఇమ్రాన్ ఎదుర్కొన్నారు. 


ఈ విశ్వాస పరీక్షలో ఇమ్రాన్ విజయం సాధించడంతో పాక్ రాజకీయాలపై మరింత పట్టును సాధించే అవకాశాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఆర్థిక మంత్రి ఓటమితో ఇమ్రాన్‌ను ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఈ డిమాండ్ ముదరకుండా ఇమ్రాన్ వేగంగా పావులు కదిపారు. విశ్వాస పరీక్షకు వెళ్తానని ప్రకటించారు. దీంతో ప్రతిపక్షాలు ఇరుకునపడ్డాయి. చివరికి ఇమ్రాన్ విశ్వాస పరీక్షలో విజయం సాధించారు. 

Updated Date - 2021-03-06T19:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising