ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tehreek-i-Labbaik ఉగ్రవాద సంస్థపై నిషేధం ఎత్తివేసిన పాక్

ABN, First Publish Date - 2021-11-08T22:14:03+05:30

ఉగ్రవాదంపై తమ వైఖరి ఏమాత్రం మారదని పాకిస్థాన్ మరోమారు నిరూపించింది. ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఐ-లబైక్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ఉగ్రవాదంపై తమ వైఖరి ఏమాత్రం మారదని పాకిస్థాన్ మరోమారు నిరూపించింది. ఉగ్రవాద సంస్థ తెహ్రీక్-ఐ-లబైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ)పై నిషేధాన్ని ఎత్తివేసింది. అక్టోబరు 18న ఈ సంస్థ నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో 20 మందికిపైగా మరణించారు. వారిలో అత్యధికులు పోలీసులే. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

 

 ఫ్రాన్స్‌లో దైవదూషణకు సంబంధించిన కార్టూన్ల వివాదంలో ఫ్రెంచ్ రాయబారిని దేశం నుంచి బహిష్కరించాలంటూ టీఎల్‌పీ నిర్వహించిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. దీంతో తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో టీఎల్‌పీని నిషేధించింది.


ఇటీవల ఈ సంస్థతో రహస్య ఒప్పందం చేసుకున్న ఇమ్రాన్ ప్రభుత్వం ఆ సంస్థపై గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆదివారం ఓ నోటిఫికేషన్ జారీ విడుదల చేసింది. చట్టాన్ని అనుసరించేందుకు కట్టుబడి ఉండడంతో టీఎల్‌పీపై నిషేధాన్ని ఎత్తివేసినట్టు ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.

Updated Date - 2021-11-08T22:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising