ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాకిస్థాన్‌లో టిక్‌టాక్‌పై నిషేధం ఎత్తివేత

ABN, First Publish Date - 2021-04-02T00:13:33+05:30

చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధాన్ని పెషావర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెషావర్ : చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై నిషేధాన్ని పెషావర్ హైకోర్టు గురువారం ఎత్తివేసింది. ఈ యాప్‌లో అనైతిక కంటెంట్ అప్‌లోడ్ కాకుండా చర్యలు తీసుకోవాలని టెలికమ్యూనికేషన్ అథారిటీని ఆదేశించింది. 


అశ్లీల కంటెంట్ అప్‌లోడ్ అవుతోందనే ఆరోపణలపై టిక్‌టాక్‌పై మార్చి 11న పెషావర్ హైకోర్టు నిషేధం విధించింది. గురువారం ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఈ యాప్‌లో అసభ్యకరమైన, అనైతికమైన కంటెంట్ అప్‌లోడ్ అవకుండా చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ టెలికమ్యూనికేషన్ అథారిటీ (పీటీఏ)ని ఆదేశించింది. తదుపరి విచారణ మే 25న జరుగుతుందని, సవివరమైన సమాధానాన్ని సమర్పించాలని పీటీఏని ఆదేశించింది. పెషావర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కైసర్ రషీద్ ఈ తీర్పు చెప్పారు. 


టిక్‌టాక్‌లో అనైతిక కంటెంట్‌ను తొలగించేందుకు తీసుకుంటున్న చర్యలేమిటో వివరించాలని అధికారులను జస్టిస్ రషీద్ అడిగారు. దీనిపై పీటీఏ డీజీ తారిక్ గండపుర్ స్పందిస్తూ, అశ్లీల కంటెంట్‌ను షేర్ చేసేవారిని బ్లాక్ చేయడానికి టిక్‌టాక్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. 


Updated Date - 2021-04-02T00:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising