ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: పాక్‌లో కరోనా నాలుగో వేవ్..!

ABN, First Publish Date - 2021-07-11T23:49:10+05:30

పాకిస్థాన్‌లో ఇటీవల కాలంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో దేశంలో నాలుగో వేవ్ మొదలైందనే అంచనాకు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో నాలుగో వేవ్ మొదలైందనే అంచనాలు ఊపందుకున్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. మూడు వారాల నాటి లెక్కలతో పోలిస్తే ప్రస్తుతం అక్కడ రోజువారి కరోనా కేసుల సంఖ్య ఏకంగా మూడు రెట్లు పెరిగింది. జూన్ 21న అక్కడ రోజువారి కేసుల సంఖ్య 663గా ఉండగా.. గత 24 గంటల్లో అక్కడ కొత్తగా 1920 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం కరోనా ఆంక్షలకు సడలింపులు ప్రకటించడంతో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరోమారు లాక్‌డౌన్ విధించాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అంతకుమనుపు..ఇమ్రాన్ ప్రభుత్వం హైస్కూల్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించి విమర్శల పాలైంది.  పరీక్షలు నిర్వహిస్తే కేసుల పెరుగుదల తప్పదని అప్పట్లోనే నిపుణులు హెచ్చరించినా కూడా ఇమ్రాన్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దేశంలో చేపడుతున్న వ్యాక్సిన్ కార్యక్రమం ద్వారా కరోనాను ఎదుర్కోగలమని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ధీమాగా ఉన్నట్టు అక్కడి పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు తమంతట తాముగా ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-07-11T23:49:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising