ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాక్: ప్రజాగ్రహంతో హిందూ దేవాలయానికి స్థలాన్ని తిరిగి కేటాయింపు

ABN, First Publish Date - 2021-11-09T21:29:13+05:30

ఇస్లామాబాద్‌లో మొదటిసారిగా మందిర నిర్మాణం కోసం 2016లో అర్థ ఎకరం స్థలాన్ని కేటాయించారు. ఇందులో మందిరంతో పాటు కమ్యూనిటీ సెంటర్, హిందూ స్మశాన వాటికను నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సీడీఏ అధికారులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో మొట్టమొదటి మందిర నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ (సీడీఏ) స్వాధీనం చేసుకుంది. కాగా, దీనిపై ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తడంతో మందిర నిర్మాణానికి తిరిగి స్థలాన్ని కేటాయించింది. ఈ విషయమై ఇస్లామాబాద్ హైకోర్టు తాజా విచారణ చేపట్టినట్లు పాకిస్తాన్‌లో ప్రధాన వార్తా పత్రిక అయిన డాన్ గురువారం పేర్కొంది. అయితే తాము ఎవరికీ వ్యతిరేకంగా వ్యవహరించలేదని, కొన్ని కారణాల దృష్ట్యా నిర్మాణాల్ని అడ్డుకున్నామని సీడీఏ పేర్కొంది. విశ్వవిద్యాలయాలు, కార్యాలయాలతో పాటు ప్రార్థనా మందిరాల నిర్మాణాలను కూడా నిలిపివేసినట్లు సీడీఏ అధికారులు కోర్టుకు తెలిపారు.


ఇస్లామాబాద్‌లో మొదటిసారిగా మందిర నిర్మాణం కోసం 2016లో అర్థ ఎకరం స్థలాన్ని కేటాయించారు. ఇందులో మందిరంతో పాటు కమ్యూనిటీ సెంటర్, హిందూ స్మశాన వాటికను నిర్మించాలని నిర్ణయించారు. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో సీడీఏ అధికారులు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ఇస్లామాబాద్‌లో నిరసనలు వ్యక్త మయ్యాయి. ఇక నెటిజెన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీంతో సీడీఏ దిగిరాక తప్పలేదు. మందిరానికి కేటాయించిన స్థలాన్ని తిరిగి ఇవ్వడంతో పాటు నిర్మాణాలకు సముఖత వ్యక్తం చేశారు.

Updated Date - 2021-11-09T21:29:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising