ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆప్ఘన్‌పై చర్చల బృందంలో భారత్ అక్కర్లేదు : పాకిస్థాన్

ABN, First Publish Date - 2021-09-07T23:55:21+05:30

ఆఫ్ఘనిస్థాన్‌పై చర్చల బృందం (ట్రోయికా)లో భారత్‌ను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్కో : ఆఫ్ఘనిస్థాన్‌పై చర్చల బృందం (ట్రోయికా)లో భారత్‌ను చేర్చడానికి పాకిస్థాన్ విముఖత వ్యక్తం చేసింది. రష్యా, అమెరికా, చైనా, పాకిస్థాన్ ఈ ట్రోయికాలో ఉన్నాయి. దీనిని విస్తరించి భారత్, ఇరాన్‌కు చోటు కల్పించడంపై చర్చలు జరుగుతున్నాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్‌రోవ్ అన్నారు. 


రష్యాకు పాకిస్థాన్ రాయబారి షఫ్‌కత్ అలీ ఖాన్ ఓ రష్యన్ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ట్రోయికా ప్లస్‌లో చేరాలని ఇరాన్‌ను ఆహ్వానించినట్లు తెలిపారు. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేరవచ్చునని తెలిపినట్లు చెప్పారు. ఇప్పటి వరకు ఇరాన్ దీనిపై ఓ నిర్ణయం తీసుకోలేదన్నారు. అయితే ట్రోయికా ప్లస్‌లో భారత్ చేరుతున్నట్లు రష్యా విదేశాంగ మంత్రి లవ్‌రోవ్ చెప్పినట్లు తనకు తెలియదన్నారు. తమ విషయానికొస్తే, ట్రోయికా ప్లస్‌లో భారత్ ఓ క్యాండిడేట్ కాదన్నారు. 


Updated Date - 2021-09-07T23:55:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising