ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘోరంగా పతనమైన PAK రుపీ...

ABN, First Publish Date - 2021-10-20T22:46:59+05:30

పాకిస్థానీ రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్ : పాకిస్థానీ రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు ఇంటర్ బ్యాంక్ కరెన్సీ మార్కెట్లో బాగా పతనమవుతోంది. బుధవారం ఒక అమెరికన్ డాలర్‌కు రూ.173.50కు పతనమై ఆల్-టైమ్ కనిష్ట స్థాయికి చేరింది. ట్రేడింగ్ డే ప్రారంభంలో అమెరికన్ డాలర్ విలువ 37 పైసలు పెరిగింది. అమెరికన్ డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది.


ఎక్స్ఛేంజ్ రేటుపై ఒత్తిడిని సడలించేందుకు స్టేట్ బ్యాంకు చేపట్టిన అనేక చర్యలు పెద్దగా ఫలితమివ్వడం లేదు. అమెరికన్ డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. పాకిస్థానీ రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చినపుడు సోమవారం రూ.172.72 వద్ద ముగిసింది. బుధవారం డాలర్ విలువ 37 పైసలు పెరిగింది. రూపాయి విలువ రూ.173.50కు పతనమైంది. 


విదేశీ కరెన్సీ లావాదేవీల్లో పారదర్శకతను పెంచేందుకు సెంట్రల్ బ్యాంకు అనేక చర్యలు చేపట్టింది. విదేశీ కరెన్సీ అవాంఛనీయంగా బయటికి పోకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ వెళ్ళేవారు ఒకసారి ఒక వ్యక్తికి 1,000 డాలర్ల చొప్పున మాత్రమే తీసుకెళ్ళాలని ఆంక్షలు విధించింది. 


Updated Date - 2021-10-20T22:46:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising