ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెడ్‌లిస్ట్ నుంచి తప్పించండి.. యూకేకు పాక్ అభ్యర్థన

ABN, First Publish Date - 2021-08-09T01:36:30+05:30

భారత ప్రయాణికులకు యూకే ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుపై పాక్ స్పందించింది. భారత ప్రయాణికులకు ఇచ్చిన వెసులుబాటునే.. తమ దేశానికి చెందిన ప్రయాణికులకూ ఇవ్వాలని కోరింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో యూకే భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో పెట్టింది. ప్రస్తుతం పరి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత ప్రయాణికులకు యూకే ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాటుపై పాక్ స్పందించింది. భారత ప్రయాణికులకు ఇచ్చిన వెసులుబాటునే.. తమ దేశానికి చెందిన ప్రయాణికులకూ ఇవ్వాలని కోరింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇండియాలో కొవిడ్ విజృంభణ నేపథ్యంలో యూకే భారత్‌ను రెడ్‌లిస్ట్‌లో పెట్టింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడిన కారణంగా రెడ్‌లాస్ట్‌ నుంచి తొలగించి, అంబర్ లిస్ట్‌లో చేర్చింది. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకన్న ప్రయాణికులకు తప్పనిసరి హోటల్ క్వారెంటైన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. హోం క్వారెంటైన్‌లో ఉంటే సరిపోతుందని చెప్పింది. ఆగస్ట్ 8 నుంచి ఈ సవరించిన ఆంక్షలు అమలులోకి వస్తాయని పేర్కొంది. ఈ క్రమంలో పాక్ స్పందించింది. తమ దేశాన్ని కూడా రెడ్‌లిస్ట్ నుంచి తప్పించాలని ఓ పిటిషన్ ద్వారా యూకేను కోరింది. రెడ్‌లిస్ట్‌లో పెట్టిన కారణంగా వేలాది మంది ప్రయాణికులు పాక్‌లో చిక్కుకుపోయారని తెలిపింది. 


Updated Date - 2021-08-09T01:36:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising