ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కులభూషణ్‌‌కు అనుకూలంగా పాక్ పార్లమెంట్ తీర్మానం

ABN, First Publish Date - 2021-11-18T01:05:02+05:30

జూలై 10న కులభూషణ్ పాకిస్తాన్‌లోని ఏదేని హైకోర్టును ఆశ్రియించేందుకు పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 51 ఏళ్ల జాదవ్‌పై 2017 ఏప్రిల్‌లో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే ఈ విషయమై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: చాలా కాలంగా పాకిస్తాన్ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కులభూషణ్ జాదవ్‌కు ఊరట లభించింది. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించే విధంగా ఆయనకు అవకాశం కల్పిస్తూ చేసిన తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లెమంట్ బుధవారం ఆమోదించింది. అయితే వాస్తవానికి అంతర్జాతీయ కోర్టు తీర్పు మేరకు పాకిస్తాన్ పార్లమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నది. బుధవారం పాకిస్థాన్‌ పార్లమెంట్ ఉమ్మడి సెషన్ మూడు ముఖ్యమైన బిల్లులను ఆమోదించింది. అందులో కులభూషణ్ జాదవ్‌కు అప్పీల్ చేసుకునే హక్కును కల్పించే బిల్లు కూడా ఉంది.


జూలై 10న కులభూషణ్ పాకిస్తాన్‌లోని ఏదేని హైకోర్టును ఆశ్రియించేందుకు పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. 51 ఏళ్ల జాదవ్‌పై 2017 ఏప్రిల్‌లో పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే ఈ విషయమై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించి జాదవ్ మరణ శిక్షను సవాల్ చేసింది. అలాగే జాదవ్‌పై పాక్ చేస్తున్న ఆరోపణల్ని కూడా అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్ ఎండగట్టింది. దీంతో ఉరిశిక్షపై పునరాలోచన చేయాలని పాకిస్తాన్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం సూచించింది.

Updated Date - 2021-11-18T01:05:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising