ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Oxygen సరఫరా బ్యాంకు ప్రారంభం

ABN, First Publish Date - 2021-10-22T14:09:04+05:30

ఇంట్లోనే చికిత్స పొందే కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు అనువుగా నగరంలోని విరుదంబట్టు మెట్టూరు పిళ్లయార్‌ గుడివీధిలో ఆక్సిజన్‌ సరఫరా బ్యాంకు ఏర్పాటైంది. జూనియర్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(Chennai): ఇంట్లోనే చికిత్స పొందే కరోనా బాధితులకు అవసరమైన ఆక్సిజన్‌ను సరఫరా చేసేందుకు అనువుగా నగరంలోని విరుదంబట్టు మెట్టూరు పిళ్లయార్‌ గుడివీధిలో ఆక్సిజన్‌ సరఫరా బ్యాంకు ఏర్పాటైంది. జూనియర్‌ రెడ్‌క్రాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ బ్యాంకును వేలూరు తహసీల్దారు విష్ణుప్రియ గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంకా వేలూరు జిల్లా ప్రధాన విద్యాధికారి మునుస్వామి, విద్యాధికారి సంపత్‌, రెడ్‌క్రాస్‌ ఉపాధ్యక్షుడు వారివల్లన్‌, కార్యదర్శి శివదడివు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూనియర్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా నిర్వాహకులు జనార్ధనన్‌ మాట్లాడుతూ.. తమ బ్యాంకులో ఉచితంగా ఆక్సిజన్‌ సిలిండర్‌ పొందేవారు రూ.5 వేలు డిపాజిట్‌ చేయాల్సి వుంటుందన్నారు. అంతేగాక డాక్టర్‌ సిఫారసు లేఖ, చిరునామా తెలిపే ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీ కూడా ఇవ్వాల్సి వుంటుందన్నారు. ఒక్కో ఆక్సిజన్‌ మిషన్‌ను 15 రోజుల వరకు ఉంచుకో వచ్చన్నారు. అంతేగాక ఆ మిషన్‌లో ఏదేని సాంకేతిక లోపం తలెత్తితే దాని మరమ్మతుకు అయ్యే ఖర్చును లబ్ధిదారులే భరించాల్సి వుంటుందని వివరించారు. మరిన్ని వివరాలకు 9443345667, 9944141099 మొబైన్‌ నెంబర్లలో సంప్రదించవచ్చు.

Updated Date - 2021-10-22T14:09:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising