ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meerut : జిల్లాలో 30 డెంగీ కేసులు

ABN, First Publish Date - 2021-09-09T18:09:59+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో కొత్తగా 33 డెంగీ కేసులు వెలుగుచూశాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటింటి సర్వే ప్రారంభం

మీరట్ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ జిల్లాలో కొత్తగా 33 డెంగీ కేసులు వెలుగుచూశాయి. దోమల వ్యాప్తి వల్ల డెంగీ జ్వరాల జోరు పెరగడంతో పలువురు రోగులు ఆసుపత్రుల్లో చేరారు. మరో 18 మంది డెంగీ జ్వరాల నుంచి కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అఖిలేష్ మోహన్ చెప్పారు. డెంగీ జ్వరాల జోరు పెరగడంతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో డాక్టర్లను నియమించడంతో పాటు మందులను సిద్ధంగా ఉంచారు. డెంగీ జ్వరాలు సోకిన వారిని ఆసుపత్రులకు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు. దీంతోపాటు ఈ నెల 16వతేదీ వరకు ఇంటింటి సర్వే చేస్తున్నామని వైద్యులు చెప్పారు. అధిక జ్వరం, లో బీపీ, తలనొప్పి, కడుపునొప్పి లక్షణాలుంటే వెంటనే డెంగీ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచించారు. జ్వరాల బారిన పడిన ప్రజలు అధిక నీరు తాగాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వైద్యులు కోరారు.యూపీలో ప్రబలుతున్న జ్వరాలను అదుపు చేసేందుకు ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంటుందని యూపీ ఆరోగ్యశాఖ మంత్రి సింగ్ చెప్పారు.

Updated Date - 2021-09-09T18:09:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising