ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటక కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు...ఆరంజ్ అలర్ట్ జారీ

ABN, First Publish Date - 2021-06-14T14:21:10+05:30

కర్ణాటక కోస్తా జిల్లాల్లో జూన్ 17వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు (కర్ణాటక): కర్ణాటక కోస్తా జిల్లాల్లో జూన్ 17వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ బెంగళూరు విభాగం డైరెక్టరు సీఎస్ పాటిల్ వెల్లడించారు. కర్ణాటక కోస్తా జిల్లాలు, దక్షిణ అంతర్ జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని పాటిల్ హెచ్చరించారు. భారీవర్షాలు కురుస్తున్నందున కర్ణాటక కోస్తా జిల్లాల్లో ఆరంజ్ అలర్ట్ జారీ చేశామని పాటిల్ వివరించారు. జూన్ 13 నుంచి 17వతేదీ వరకు ఉత్తరకన్నడ, ఉడుపి, దక్షిణ కన్నడ, శివమొగ్గ, చిక్ మంగళూరు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. 


బెంగళూరు నగరంలో రాగల రెండు రోజుల పాటు సాధారణం నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని డైరెక్టరు చెప్పారు. కొంకణ్, గోవా, కోస్తా కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతాల్లో వచ్చే నాలుగైదు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ అధికారులు సూచించారు.

Updated Date - 2021-06-14T14:21:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising