ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Opsకు పెరుగుతున్న మద్దతు

ABN, First Publish Date - 2021-10-29T15:12:13+05:30

అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోవడంపై ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటామంటూ ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలకు క్రమేణా మద్దతు పెరుగుతోంది. శశికళ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆయన మాటల్లో తప్పేముంది?: సెల్లూర్‌ రాజు

- ఎడప్పాడిని తొలగించండి: పుహళేంది


చెన్నై(Chennai): అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోవడంపై ఆలోచించి తగిన నిర్ణయం తీసుకుంటామంటూ ఆ పార్టీ సమన్వయకర్త ఒ.పన్నీర్‌సెల్వం చేసిన వ్యాఖ్యలకు క్రమేణా మద్దతు పెరుగుతోంది. శశికళ వ్యవహారాన్ని ఇన్నాళ్లూ చూసీ చూడనట్టు తప్పించుకున్న సీనియర్లు ఇప్పుడు క్రమంగా ముందుకు వస్తు న్నారు. ఆమెను పార్టీలో చేర్చుకోవడంపై ఓపీఎస్‌ చేసిన వ్యాఖ్యల్లో తప్పే ముందంటూ ప్రశ్నిస్తున్నారు. అన్నాడీఎంకే స్వర్ణోత్సవాలకు ఒక్కరోజు ముందు ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్‌, అధినేత్రి జయలలితలకు నివాళులర్పించిన శశికళ.. అన్నాడీఎంకేని అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లేందుకు అందరం కలిసి పని చేద్దామంటూ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమెకు పార్టీలో స్థానం లేదని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వ్యాఖ్యానించగా, పార్టీలో శశికళ చేరికపై పార్టీ అధిష్ఠానం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని పన్నీర్‌సెల్వం నర్మగర్భంగా వ్యాఖ్యా నించారు. 


ఆయన అన్నదాంట్లో తప్పులేదు: మాజీ మంత్రి సెల్లూర్‌ రాజు

శశికళను పార్టీలో చేర్చుకోవడంపై పార్టీ అధిష్ఠానం చర్చించి నిర్ణయం తీసుకుంటుందనే ఒ.పన్నీర్‌సెల్వం అన్నదాంట్లో తప్పేమీ లేదని మాజీ మంత్రి సెల్లూర్‌ రాజు వ్యాఖ్యానించారు. మదురైలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఓపీఎస్‌ వ్యాఖ్యలను పార్టీ ఉప సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి కూడా ఖండించలేదన్నారు. అందరం కలిసి నిర్ణయిద్దామని సమన్వయకర్త హోదాలో ఓపీఎస్‌ చెప్పడమే అందుకు కారణమ న్నారు. అందులో తప్పేమీ లేదని సెల్లూర్‌ రాజు పేర్కొన్నారు.


ఎడప్పాడిని తొలగించాలి: బెంగుళూరు పుహళేంది

అన్నాడీఎంకే నుంచి ఎడప్పాడి పళనిస్వామిని తొలగించి, శశికళ లేదా పన్నీర్‌సెల్వంలో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలని ఆ పార్టీ కర్ణాటక బహిష్కృత నేత పుహళేంది వ్యాఖ్యానించారు. గురువారం ఆయన చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే తిరిగి బలోపేతం కావాలంటే ఓపీఎస్‌ తగిన నిర్ణయం తీసుకోవాలన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన సమయంలో శశికళ మంచి వారు అన్న నేతలకు ఇప్పుడు ఆమె చెడ్డవారు గా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు.

Updated Date - 2021-10-29T15:12:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising