ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ బాధ్యత భారత్‌దే.. స్పష్టం చేసిన పాక్ ప్రధాని

ABN, First Publish Date - 2021-02-28T00:35:17+05:30

భారత్ పాక్‌ల మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. ఈ పరిణామంపై ఇమ్రాన్ ఖాన్ తొలిసారిగా శనివారం నాడు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: భారత్ పాక్‌ల మధ్య ఇటీవల కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్వాగతించారు. ఈ పరిణామంపై ఇమ్రాన్ ఖాన్ తొలిసారిగా శనివారం నాడు స్పందించారు. అయితే..ఇరు దేశాల సంబంధాలనను మరింత ముందుకు తీసుకెళ్లేలా సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత భారత్‌దేనని ఆయన పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరనట్టు భారత్, పాక్ మిలిటరీ అధికారులు గురువారం నాడు ప్రకటించిన విషయం తెలిసిందే. వాస్తవాధీన రేఖకు సంబంధించి గతంలో కుదిరిన ఒప్పందాలను తూచా తప్పకుండా పాటించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పాక్ సిద్ధంగా ఉందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. మిగలిన అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. 


‘కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్ధరణను నేను  స్వాగతిస్తున్నాను. అయితే.. ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లేలా వాతావరణం కల్పించాల్సి బాధ్యత భారత్‌దే. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనలను అనుసరించి. కశ్మీరీ ప్రజల డిమాండ్లు నెరవేర్చేందుకు అవసరమైన చర్యలను భారత్ కచ్చితంగా చేపట్టాలి.’ అని ఇమ్రాన్ ఖాన్ తాజాగా ట్వీట్ చేశారు. మేము ఎల్లప్పుడూ శాంతి నెలకొల్పేందుకే కృషి చేశాం. మునుపటి సమస్యలన్నీ చర్చల ద్వారా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ ఇమ్రాన్ ఖాన్ వరుస ట్వీట్లు చేశారు. 

Updated Date - 2021-02-28T00:35:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising